నకిలీ వీడియోలని అమిత్ షా ఎలా డిసైడ్ చేస్తారు…?

నీతి నిజాయితీలకు తమ పార్టీ మారు పేరు అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నేతలకు.. కొద్ది రోజుల నుంచి మింగుడు పడని నిజాలు బయటకు వస్తున్నాయి. వారు చెప్పుకుంటున్న దానికి రివర్స్‌లో సాక్ష్యాలతో సహా… వారి బండారం బయటపడే పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా… అత్యంత అవినీతిపరులుగా పేరు పడ్డ వారిని నేరుగా సమర్థించేందుకు.. అదీ కూడా… వారిని కేసుల నుంచి బయటపడేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీ నేతలు నిలువుగా దొరికిపోతున్నారు. అలా దొరికిపోయినా… తామేం తప్పు చేయడం లేదని సమర్థించుకుంటూ … మరింతగా దిగజారిపోతున్నారు.

కొద్ది రోజుల క్రితం.. గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై… సీబీఐ చేతులెత్తేసిందని… ప్రచారం జరిగింది. దానికి సంబంధించి సీబీఐ రహస్యంగా కోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రాలు బయటకు వచ్చాయి. కర్ణాటక, గోవా, తమిళనాడు సీబీఐ అధికారులు… అక్రమంగా తరలిపోయిన ఐరన్ ఓర్ గురించి ఏమీ తెలుసుకోలేమని చెప్పేసి కేసులను క్లోజ్ చేసేశారు. ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ సీబీఐ దాఖలు చేసిన కేసుల్లోనే విచారణ ఉంది. దీన్ని కూడా ప్రభావితం చేసేలా… నేరుగా ప్రధానమంత్రే బళ్లారిలో ప్రసంగాలు చేశారు. బళ్లారిపై అవినీతి ముద్ర వేశారని… అలా వేసిన వారిని శిక్షించాలంటూ.. పరోక్షంగా గాలి జనార్ధన్ రెడ్డిని నీతి మంతుడిగా చెబుతూ.. ఆయన అనుచరుల్ని గెలిపించాలని ప్రచారం చేశారు. గాలి సోదరుడు… న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో జైలుకు వెళ్లి .. బెయిల్ పై ఉన్న సోమశేఖర్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆయన ప్రచారం చేశారు. దాంతో మైనింగ్ డాన్‌కు మోదీ నేరుగా మద్దతిచ్చినట్లయింది. ఇప్పుడు అదే మైనింగ్ గ్యాంగ్..సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వందల కోట్ల ఇంచం ఇస్తున్నట్లు వీడియోలు విడుదలయ్యాయి. ఇలాంటి స్థితిలో కూడా… బీజేపీ గాలి గ్యాంగ్‌కు అండగా ఉండటానికే సిద్ధపడింది.

కన్నడ టీవీ చానల్స్ బయటపెట్టిన వీడియోలపై… ఇతర పార్టీల నేతలు విమర్శలు ప్రారంభించి ప్రారంభిచక ముందే… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… వాటిని నకిలీ వీడియోలుగా ప్రకటించేశారు. నిజానికి వీడియోల్లో ఉన్న వ్యక్తులు.. అంటే.. ఎంపి బి.శ్రీరాములు ఇంత వరకూ నోరు మెదపలేదు. కానీ… ఆయనకంటే ముందుగా అత్యుత్సాహంతో అమిత్ షా .. .. అవి నకిలీ వీడియోలను డిక్లేర్ చేసేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షునిగా ఉన్న అమిత్ షా… విచారణ సంస్థల మీద కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఆ విషయం తెలియనంత అమాయకుడేం కాదు షా. గాలి గ్యాంగ్‌ను అడ్డంగా కాపాడటమే అయన ఇంటెన్షన్ కావొచ్చు. కానీ అది దేశాన్ని మోసం చేయడమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com