మీడియాకు`తాళం’,ఇదే బీజేపీ వ్యూహం

నేషనల్ ఛానెల్ లో చర్చకు రమ్మంటూ పిలుపువచ్చింది అధికార పార్టీ నేతకు. ఎగిరిగంతేసి టీవి స్టేషన్ కు వెళ్ళి చర్చలో కూర్చున్నాడు. కానీ అక్కడజరిగిన హాట్ హాట్ డిస్కషన్ లో నోరెళ్లబెట్టాడు. కెమేరాముందు నవ్వుతూ కూర్చోవడం, అవతలవాళ్లు చెప్పింది శ్రద్ధగా వినడం, మరీ గుచ్చిగుచ్చి అడిగితే `మేము దాన్ని ఖండిస్తున్నాం, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర, మేము అవినీతిరహితపాలన అందిస్తున్నాం…’ లాంటి పడిగట్టుపదాలు దొర్లించాడు. నెగెటీవ్ ప్రచారాన్ని సహేతుకంగా తిప్పికొట్టడంలో అన్నిపార్టీలు విఫలమవుతున్నాయి. అందుకే కేవలం అరుపులు, కేకలతో చర్చాకార్యక్రమాలను వేడెక్కిస్తుంటారు. చివరకు వారేంమాట్లాడుతున్నారో వారికే తెలియని అయోమయపరిస్థితి ఏర్పడుతున్నది.

అదే చాక్లెట్లో, కూల్ డ్రింక్ లో లేదా జంక్ ఫుడ్స్ తయారుచేసే కంపెనీపై విస్తృతస్థాయిలో నెగటీవ్ ప్రచారం వచ్చినప్పుడు వారు చాలాకూల్ స్పందిస్తారు. ఎలాంటి భావోద్వేగాలకు లోనుకారు. సంపూర్ణంగా స్టడీచేసి వివరణ ఇస్తారు. లోపాలేమైనాఉంటే వాటిని సరిచేసుకున్నామని చెబుతారు. పాత స్టాక్ ని వెనక్కి తీసుకుని సరిచేసిన కొత్తస్టాక్ ని దింపుతారు. ఇలా కార్పొరేటీవ్ కంపెనీలు మళ్ళీ మార్కెట్ లో పాజిటీవ్ స్పందన తీసుకురాగలుగుతున్నారు. ఇది కార్పొరేటీవ్ స్ట్రాటజీ. కానీ రాజకీయ పార్టీలదగ్గరకు వచ్చేసరికి ఇది లోపిస్తోంది. టివీ చర్చాకార్యక్రమాల్లో కేవలం అరుపులు, కేకలుతప్ప పాయింట్ టు పాయింట్ డిస్కషన్ జరగకపోవడానికి ప్రధానకారణం చర్చలో పాల్గొన్నవారి వద్ద సరైన డేటా ఉండకపోవడం. ఈ బలహీనతను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విమర్శనాస్త్రాలను తిప్పికొట్టలేనివారు నాయకులెలా అయ్యారని ఎగతాళిచేస్తున్నారు. మరి ఈ ధోరణి మారాలంటే సదరు పార్టీలు ఏంచేయాలి?

టీవిల్లో చర్చాకార్యక్రమాలు, లేదా ప్రెస్ మీట్ ల్లో చాలాసందర్భాల్లో నాయకులు ఇబ్బందులను ఎదుర్కుంటారు. వీరు అధికారపక్షనేతలైనా కావచ్చు, లేదా ప్రతిపక్షంవాళ్లైనా కావచ్చు. దీనికి ప్రధానకారణం ప్రధానఅంశాలపై స్టడీచేయకపోవడం. ఒకపక్క మీడియావాళ్లు తమవద్ద ఉన్న సబ్జెక్ట్ ని పాయింట్లుగా రాసుకుని, తగిన సాక్ష్యాధారాలతో ప్రశ్నలు సంధిస్తుంటే, ఎదురుగా కూర్చున్న రాజకీయనాయకుడు మాత్రం తనపార్టీలోని సంగతులే తనకుతెలియదన్నట్టు బిక్కమొహంవేయాల్సివస్తున్నది. పార్టీ మీడియాప్రతినిధులనుకున్నవారికిసైతం పార్టీ అధిష్టానం నుంచి కచ్చితమైన సమాచారం త్వరత్వరగా అందకపోవడంతో ముక్కుసూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారపార్టీపై నెగెటీవ్ ప్రచారం రావడం చాలాసహజం. అలాంటప్పుడు ధీటుగా తిప్పికొట్టాలేగానీ మౌనంగాఉండిపోకూడదు. మౌనం అర్థాంగికారమన్న సంకేతం ప్రజల్లోకి వెళుతుంది. అది వచ్చేఎన్నికలపై ప్రభావం చూపుతుంది. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడం ఎలా? ప్రస్తుతం కేంద్రంలో అధికారపార్టీగాఉన్న బీజేపీ ఈదిశగా ఆలోచిస్తున్నది. భారతీయజనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇందుకోసం పకడ్బందీగా ఓ ప్రణాళిక రచించారు. మొత్తానికి మీడియా నోటికి తాళం బిగించడమెలా అన్నదే ఈ ప్రణాళికలోని ముఖ్యసూత్రం.

పార్టీ అంతర్గత వర్గాలవారికి 12పేజీల లేఖను ఆమధ్య అమిత్ షా రాశారు. పార్టీ వారికోసం రాసిన లేఖ కూడా మీడియాకు చిక్కింది. (సరే ఇదో వైఫల్యం) పార్టీపై వస్తున్న నెగెటీవ్ ప్రచారానికి కళ్లెం బిగించడమే ఈలేఖ ఉద్దేశం. ప్రజల్లో మంచిపేరు సంపాదించడంకోసం అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులోఉంచడం దీని లక్ష్యం. ఈలేఖలోని ప్రధాన అంశాలు ఇవి…

1. టీవి డిబెట్లలో పాల్గొనేవారు తమపార్టీపై వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ధీటుగా తిప్పిగొట్టగలగాలి.

2. తమ పార్టీ చేస్తున్న మంచిపనులపై వివిధవార్తాపత్రికలు, మేగజైన్లలో వస్తున్న ఆర్టికల్స్ ను దగ్గరుంచుకోవాలి. ఆ సమాచారాన్ని పాయింట్లుగా రాసుకుని చర్చలకు వెళ్ళాలి.

3. మీడియా అత్యధిక ప్రభావం చూపుతున్న ఈరోజుల్లో మీడియావాళ్లకు దూరంగాఉండటం క్షేమకరంకాదు. పార్టీ మీడియాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు తమకు అందుబాటులో ఉన్న సంపాదకులు, జర్నలిస్ట్ లు, కాలమిస్ట్ లతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. అలాఅని వారిని ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడకూడదు. వారి ఆలోచనలు తీసుకుంటూ వాటిని పార్టీ అధిష్టానికి తెలియజేస్తుండాలి. అలాగే, ఫలానా పని పార్టీ ఎందుకు చేయాల్సివచ్చిందో వారికి తెలియజేస్తుండాలి. దీనివల్ల పాత్రికేయుల్లోని నెగెటీవ్ ఆలోచనలు చప్పబడతాయి. ఫలితంగా ఇది చర్చాకార్యక్రమంసాగే తీరుపై ప్రభావం చూపుతుంది.

4. పార్టీ అధిష్టానం సమాచారసేకరణకు పెద్దపీటవేయాలి. ఇందుకోసం రీసెర్చ్ అండ్ ఎనలిటికల్ వింగ్ ని పటిష్టపరుచుకోవాలి. ప్రతిఅంశంపై డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండాలి. ఇందుకు డిజిటల్ టెక్నాలజీని వాడుకోవాలి.

5. విదేశీ మీడియా మనగురించి ఏమిరాస్తుందో తెలుసుకుంటూ అక్కడి మీడియాకు పూర్తి అవగాహన కలిగించడానికి అవసరమైన సమాచారాన్ని అందించాలి.

6. పార్టీ సంపూర్ణ చరిత్ర ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండాలి. ఢిల్లీలోని పార్టీ లైబ్రరీ ప్రతి డాక్యుమెంట్ మండలస్థాయి, జిల్లాస్థాయికి అందేలా చూడాలి. పార్టీ నేతల ఫోటోలు, ముఖ్యమైన కార్యక్రమాలు…అన్నీ డిజిటల్ రూపంలో ఉంచాలి. కోరుకోగానే క్షణాల్లో ఆ సమాచారం అందుబాటులోకిరావాలి.

7. క్విక్ రిఫరెన్స్ చేసుకునేవారికోసం ప్రతి ఆర్టికల్ సారాంశాన్ని పాయింట్ల రూపంలో ఇవ్వాలి. బీజేపీకి 15లక్షలమంది కీలకసభ్యులున్నారు. ప్రతిరోజూ వారికి ఏదో ఒక సమాచారం అవసరమవుతుంటుంది. అదివెంటనే లభ్యమైతే ధీటుగా మాట్లాడగలుగుతారు.

8. సోషల్ మీడియాలో కూడా పార్టీకి సంబంధించిన పాజిటీవ్ అంశాలు అందించాలి. విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి. అప్పుడే పార్టీ మద్దతుదారుల బలం పెరుగుతుంది.

కేంద్రంలో బీజేపీ అనేక సమస్యలను ఎదుర్కుంటున్నది. త్వరలో బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. మరో పక్క భూసేకరణ బిల్లుకు తీవ్రవ్యతిరేకత కనబడుతోంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి వన్ ర్యాంక్ వన్ పెన్షన్లు, పటేళ్ల రిజర్వేషన్ ఆందోళన వంటివి డిబేటబుల్ టాపిక్స్ గా మారాయి. సీనియర్ నాయకుల (సుష్మా స్వరాజ్, వసుంధర రాజె)పై ముసురుకున్న వివాదాలు ఉండనేఉన్నాయి. వీటన్నింటినీ త్రిప్పికొట్టాలంటే అందరివద్ద ఫక్కా సమాచారం ఉండితీరాలి. ఇదే బీజేపీ అధ్యకుని ప్రస్తుత ఆలోచన.

సరే, ఆలోచన బాగుంది. ఆచరణలో ఎంతవరకు ముందుకెళతారో చూడాలి. అన్నింటికంటే ముందు పార్టీ అంతర్గతవర్గాలవారి కోసం రాసిన ఈ లేఖ కూడా మీడియాకు లీక్ అవడమేమిటో ముందు దానిపై ఆరాతీయాలేమో…

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోహ‌న్‌బాబు ‘స‌న్ ఆఫ్ ఇండియా’

ఫాద‌ర్ ఆఫ్ ది నేష‌న్ అని... మ‌హాత్మాగాంధీని పిలుస్తారు. ఇక నుంచి టాలీవుడ్ మాత్రం `స‌న్ ఆఫ్ ఇండియా` అంటే.. మోహ‌న్ బాబుని గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పేరుతో ఇప్పుడు...

వీడు మామూలోడు కాదు..! ఏకంగా లంచం కోటి..!

అవినీతిని అరికట్టేందుకు రూ. 2వేల నోట్లను కేంద్రం నియంత్రించేసింది కానీ.. అదేమీ ఈ తరహా సంపాదనకు అలవాటు పడిన వారికి అడ్డం కాలేదు. రూ. 2వేల నోట్లు కాకపోతే.. రూ. ఐదు వందల...

షాకింగ్ : హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్..!?

ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయమైన పరిణామాలు రోజు రోజుకు వెలుగు చూస్తున్నాయి. అక్కడ న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ కొట్టేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయని మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ఫోన్ సంభాషణతో వెల్లడయింది. తాజాగా ఇప్పుడు.. న్యాయమూర్తుల...

విశాఖలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాదు ఓటు బ్యాంకుకు ఇళ్ల స్థలాలు..!

ఆంధ్రప్రదేశ్‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నంను చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ప్రభుత్వం... దానికి తగ్గట్లుగా "లుక్" ఉండే ప్రాజెక్టులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి రద్దు చేసుకుంటూ పోతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్యాన్సిల్ చేస్తోంది. ఓ...

HOT NEWS

[X] Close
[X] Close