యష్ రాజ్ ఫిలిమ్స్ లెగసీని ఆదిత్య చోప్రా నడిపిస్తున్న తీరుని మెచ్చుకోవాల్సిందే. తండ్రి నుంచి సినీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని దేశవ్యాప్తంగా అలరించే సినిమాలను నిర్మించడంలో ఆదిత్య ఎప్పటికప్పుడు భిన్నమైన ప్లానింగ్స్‌తో ముందుకెళ్తున్నాడు. సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా తన ఆలోచనలు క్రియేటివ్‌గా ఉంటాయి. అందరూ ఎదురుచూస్తున్న హృతిక్-ఎన్టీఆర్ వార్ 2ను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆదిత్య.. ఈ సినిమాను సంచలనంగా మార్చేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అసలైన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తున్నారు.
హృతిక్-ఎన్టీఆర్.. ఈ ఇద్దరూ డ్యాన్సింగ్ స్టార్స్. కళ్లుచెదిరేలా ఆడగలరు. డ్యాన్సుల్లో ఎవరి గ్రేస్ వారిదే. ఇద్దరికీ విలక్షణమైన సిగ్నేచర్ టైమింగ్ ఉంది. ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే మామూలుగా ఉండదు. ఇలాంటి స్టార్స్‌తో సినిమా చేసినప్పుడు, కథ డిమాండ్ చేయకపోయినా.. ప్రమోషనల్ సాంగ్ కోసమైనా ఓ డ్యాన్స్ నంబర్ పెట్టాల్సిందే. ఈ ఐడియా ఆదిత్యకి ఎప్పుడో వచ్చింది. ఈ సినిమా కోసం జనాబే ఆలీ అనే పాటను షూట్ చేశారు. రేపు గ్లింప్స్ వదులుతున్నారు. పూర్తి పాట మాత్రం నేరుగా సినిమాలోనే చూడాలి. ఇప్పటికే ఈ సినిమాపై బోలెడు అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు డ్యాన్సింగ్ నంబర్ కూడా తోడైంది. హృతిక్-ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేసే ఆ కిక్కే వేరు.
ఈ పాట కథలో వస్తుందా? టైటిల్స్‌లో వేస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ సాంగ్ ప్లేస్మెంట్ ఏదైనా ఈ పాట ఇచ్చే కిక్ వేరే లెవల్లో ఉండబోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.