ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. వార్ 2 అప్ డేట్ వచ్చేసింది. ఈనెల 20న ‘వార్ 2’ నుంచి ఓ గ్లింప్స్ రాబోతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ఇది. ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క అప్ డేట్ కూడా లేదు. ఈరోజు హృతిక్ ఎన్టీఆర్‌ని ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ”తారక్ ఈనెల 20న ఏం జరబోతోందో తెలుసా? నీకు కూడా ఐడియా లేదేమో? రెడీగా ఉండు” అంటూ యుద్ధాన్ని ప్రకటించేశాడు. దాంతో ఈనెల 20న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని అభిమానుల్లు ఊహల్లో తేలిపోతున్నారు. వార్ 2లో ఈ హీరోలిద్దరి లుక్ కూడా ఇప్పటి వరకూ రివీల్ కాలేదు. ఈ గ్లింప్స్ తో ఆ లోటు కూడా తీరబోతోంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉంటున్నాడు ఎన్టీఆర్. జులై నుంచి ‘వార్ 2’ ప్రమోషన్లకు టైమ్ కేటాయిస్తాడు. చివరి 15 రోజులూ `వార్ 2` టీమ్ తోనే ఉండబోతున్నాడని టాక్. ‘దేవర’ తరవాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా స్ట్రయిట్ గా ఓ హిందీ సినిమా చేయడం ఇదే తొలిసారి. ‘వార్’ సూపర్ హిట్ ఫ్రాంచైజీ. ఇలా ఎన్ని రకాలుగా చూసినా ‘వార్ 2’పై విపరీతమైన హైప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ తో అది మరింత పెరిగింది. ఎన్టీఆర్, హృతిక్‌లు మంచి డాన్సర్లు. వీరిద్దరూ ఒక పాటలో కలిసి డాన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇద్దరు టాప్ డాన్సర్లు.. పోటీ పడి డాన్స్ చేస్తే కనులకు పండగే. ఆ మూమెంట్ కోసం ఇండియన్ స్క్రీన్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.