సునీల్ కి త‌గ్గించారా? త‌గ్గించుకున్నాడా?

`క‌ల‌ర్‌ఫొటో` అనే ఓ చిన్న సినిమాలో ప్ర‌తినాయ‌కుడిపాత్ర చేసేశాడు సునీల్‌. త‌న వ‌ల్ల ఈ సినిమాకి కొద్దో గొప్పో క్రేజ్ వ‌చ్చింద‌న్న‌ది వాస్త‌వం. ఈ సినిమాకి గానూ సునీల్ అందుకున్న పారితోషికం కూడా చాలా త‌క్కువ‌ట‌. అస‌లు ఆ పారితోషికం లెక్క‌లోనికే రాద‌న్న‌ది టాక్‌. ఈ సినిమా కోసం సునీల్ 9 రోజులు ప‌నిచేస్తే.. 10 ల‌క్ష‌ల పారితోషికం అందుకున్నాడ‌ట‌. అంటే… రోజుకి అటూ ఇటూగా ల‌క్ష‌.

సునీల్ కెరీర్ ప్రారంభ‌మై 20 ఏళ్లయ్యింది. ఏనాడూ.. జోరు త‌గ్గ‌లేదు. హీరోగా మార‌క‌ముందు అత్యంత బిజీగా ఉన్న క‌మేడియ‌న్ , అత్యంత ఖ‌రీదైన క‌మెడియ‌న్ కూడా త‌నే. హీరోగా ఒక్కో సినిమాకి దాదాపు 3 కోట్ల పారితోషికం తీసుకున్న సంద‌ర్భాలున్నాయి. హీరో నుంచి… మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారి కొన్ని సినిమాలు చేశాడు. అర‌వింద స‌మేత‌, డిస్కోరాజా లాంటివి. ఆయా సినిమాల‌కు రోజుకి 3 నుంచి 4 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్టు టాక్‌. అలాంటి సునీల్ స‌డన్ గా ల‌క్ష‌రూపాయ‌ల పారితోషికానికి ప‌డిపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. సునీల్ వ‌ర్గం ఏమో.. `మావాడు పారితోషికం త‌గ్గించుకున్నాడు. చిన్న సినిమా క‌దా, దాన్ని దృష్టిలో ఉంచుకునే చేశాడు` అంటున్నారు. మిగిలిన‌వాళ్లేమో.. `సునీల్ క్రేజ్ ఇలా త‌గ్గిపోయిందా` అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. సునీల్ పారితోషికం త‌గ్గించుకున్నాడా, త‌గ్గిందా? అన్న‌ది సునీల్ ఖాతాలో మ‌రో కొత్త సినిమా ప‌డేటప్పుడు తెలుస్తోంది. కాక‌పోతే.. ఈసినిమాపై సునీల్ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడ‌ని టాక్‌. ఈ సినిమాలోని త‌న న‌ట‌న చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, ఓ కొత్త సునీల్ ని చూసిన ఫీలింగ్ ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతుంద‌ని ఆశిస్తున్నాడు. అది జ‌రిగినా… త‌న క‌ష్టానికి గిట్టుబాటు `ధ‌ర‌` ద‌క్కిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఉద్రిక్తతలు” లేకుండా కేసీఆర్ ప్రచారసభ..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారసభలో వ్యూహాత్మక ప్రసంగం చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఆయన తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతారని అందరూ అనుకున్నారు....

ప్రకాష్‌రాజ్‌ సద్విమర్శనూ పాజిటివ్‌గా తీసుకోలేరా..!?

పవన్ కల్యాణ్ రాజకీయ గమనాన్ని..నిర్ణయాల్ని విమర్శించిన ప్రకాష్‌రాజ్‌పై.. పవన్ కల్యాణ్ క్యాంప్ భగ్గుమంది. జనసైనికులు ఎన్నెన్ని మాటలు ‌అన్నా.. జనసేనాని సోదరుడు నాగబాబు చేసిన విమర్శలు మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సినవే. కానీ ప్రకాష్‌రాజ్‌ను...

నవరత్నాలు ఆపేయమని జగన్‌కు ఉండవల్లి సలహా..!

జగన్ శ్రేయోభిలాషిగా అందరికీ గుర్తుండే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలి కాలంలో ప్రెస్‌మీట్లు పెట్టి.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఆయన చేస్తున్న తప్పులను కరెక్ట్ చేసి.. ఆయనకు మేలు చేద్దామన్న...

బండి సంజయ్ మధ్యంతర ఎన్నికల జోస్యాలు..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. నలుగురూ మాట్లాడుకునే స్టేట్‌మెంట్లు ఇవ్వడంలో మాస్టర్ డిగ్రీని సాధించేసినట్లుగా ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, దారుస్సలాం కూల్చివేతల తర్వాత తాజాగా.. తెలంగాణకు మధ్యంతర ఎన్నికల స్టేట్మెంట్...

HOT NEWS

[X] Close
[X] Close