కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆర్థిక కష్టాల్లో ఉంది. విరాళాలు ఇచ్చేవారు దాదాపుగా లేకపోవడంతో.. పార్టీ నడపడం కష్టంగా మారింది. కానీ గత రెండేళ్లుగా ఈ పరిస్థితి మారింది. గత ఏడాది అయితే జాక్ పాట్ తగిలిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్కు దాదాపుగా 150 శాతం విరాళాలు పెరిగాయి. ఒక్క ఏడాదిలో కాంగ్రెస్ పార్టీకి రూ. 517.37 కోట్ల నిధులు వచ్చాయి. గత గత సంవత్సరం ఇలా అందిన నిధులు రూ. 281.48 కోట్లు మాత్రమే. అంతకుముందు రూ. 79.92 కోట్లు మాత్రమే. అంటే రెండేళ్ల వ్యవధిలో 9 కోట్ల నుంచి 517 కోట్లకు విరాళాలు పెరిగాయి.
ఈ రెండేళ్లలో వచ్చిన మార్పులు.. కర్ణాటకతో పాటు తెలంగాణలో అధికారంలోకి రావడమే. రెండున్నరేళ్ల కిందట కర్ణాటకకలో.. రెండేళ్లకిందట తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ రెండూ కీలక రాష్ట్రాలే. బహుశా.. ఈ రెండు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఎక్కువగా వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే రికార్డుల్లో మాత్రం , హైదరాబాద్-తెలంగాణ నుండి భారీ విరాళాలు వచ్చినట్లుగా లేవు.
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదిక ప్రకారం హైదరాబాద్ నుండి ఏడుగురు మాత్రమే విరాళాలు ఇచ్చారు. వీరిలో ఇటీవల ఎమ్మెల్సీగా నామినేట్ అయిన విజయశాంతి కొంత మొత్తం ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నేతల ప్రయాణాలకు కూడా డబ్బులు చెల్లించే స్థితిలో ఉండేది కాదు. కానీ ఇ్పపుడు ప్రతి ఆర్థిక సంవత్సరంలో నిధులు వేగంగా పెరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. కానీ బీజేపీతో పోలిస్తే.. ఎక్కడో అట్టడుగున ఉంటుంది.బీజేపీ విరాళాలు వేల కోట్లలోనే ఉంటాయి.