నందమూరి బాలకృష్ణ అఖండ 2 షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో మిగిలిన ఒక్క సాంగ్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో మొదలుపెట్టారు.
ఇది మాస్ డాన్స్ నంబర్. 600 మంది డాన్సర్లు ఈ పాట కనిపించబోతున్నారు. అఖండలో ‘జై బాలయ్య’ సాంగ్కు కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్ ఈ పాటకు నృత్యాలు సమకూరుస్తున్నారు. తమన్ మంచి మాస్ బీట్ వున్న ట్యూన్ కంపోజ్ చేశాడు. బాలయ్య నుంచి కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఈ సాంగ్ లో వుండే అవకాశం వుంది.
ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ ని పూర్తి చేశారు బాలయ్య. దర్శకుడు బోయపాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25న రావాల్సింది. కొన్ని అనివార్యకారణాలతో వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఇస్తారు.


