మద్యం స్మగ్లర్ల బ్రాండ్ల బిజినెస్..! ఏపీలో రోజుకు వందల్లో కేసులు..!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రేట్లు చాలా ఎక్కువ. బ్రాండ్లు కూడా ఇష్టం వచ్చినవి దొరకవు. ఈ రెండింటినే ప్లస్ పాయింట్లుగా చేసుకుని సైడ్ బిజినెస్ ప్రారంభించేశారు.. కొంత మంది. కొంత మంది కాదు.. చాలా మంది. పది హేను రోజుల్లోనే.. ఇలా పొరుగు రాష్ట్రాల్లోని బ్రాండ్ల మద్యం తరలిస్తూ.. దొరికిపోయిన వారి సంఖ్య ఆరువేలకుపైగా ఉంది. 4700కుపైగా కేసులు నమోదయ్యాయి. అంటే.. రోజుకు 300కుపైగానే కేసులు నమోదవుతున్నాయి. దొరుకుతున్నవే ఇలా ఉంటే.. ఇలా దొరక్కుండా.. ఏపీలో దూరిపోతున్నవి.. లెక్క లేనన్ని ఉంటాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తంగా పదిహేను రోజుల్లో 1648 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అన్ని వాహనాల్లోనూ.. పొరుగు రాష్ట్రాల మద్యం దొరికింది. అక్కడ కొని.. ఏపీలో అమ్మకాలు చేసే లక్ష్యంతోనే వాటినీ తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు. పట్టుబడిన వాహనాల్లో.. లగ్జరీ వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీసులు చెక్ చేయరని.. బడా బాబుల కార్లు అని రకరకాలుగా చెప్పి తప్పించుకోవచ్చని ఆ పని చేస్తున్నారు. నిజానికి బడాబాబుల కార్లను.. పోలీసులు సోదాలు చేయరు. ఆ పరిస్థితి లేదు.. ఎలాంటి అండా లేని వారు వెహికల్స్ మాత్రం చెక్ చేస్తారు. అలాంటి వారే దొరికిపోతున్నారు. ఈ పరిస్థితి వల్ల పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి.

ఏపీలో తగ్గిపోతున్నాయి. ఏపీలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టడాన్ని ప్రభుత్వం మద్యం తాగేవారి సంఖ్య తగ్గిపోవడంగా చెబుతోంది. కానీ ఇలా అక్రమంగా తరలి వస్తున్న మద్యం… గ్రామాల్లో నాటు సారా విజృంభణ వంటి విషయాల్లో మాత్రం…. కట్టడి చేయలేకపోవడంతో.. ప్రభుత్వానికి వ్రతం చెడినా ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రత్యేకంగా.. మద్యం అక్రమ రవాణా కట్టడికి.. ఓ డిపార్టుమెంట్ ఏర్పాటు చేశారు. ఆ డిపార్ట్‌మెంట్‌నే పొరుగు రాష్ట్రాల మద్యాన్ని నియంత్రించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close