రివ్యూ: హంట్

Hunt Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ : 2/5

సుధీర్ బాబు హిట్ కొట్టి చాలా కాలమైయింది. ‘సమ్మోహనం’ తర్వాత ఆయనకి సరైన విజయం లేదు. గత ఏడాది వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కూడా చాలా నిరాశ పరిచింది. ఇప్పుడాయన విజయం కోసం ‘హంట్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళ చిత్రం ‘ముంబై పోలీస్’ కి రీమేక్ ఇది. సుధీర్ బాబు బాడీ లాంజ్వేజ్ యాక్షన్ థ్రిల్లర్స్ కి నప్పుతుంది. కానీ ఇప్పటివరకూ ఆయనకు సరైన యాక్షన్ సినిమా పడలేదు. దానిని కూడా ద్రుష్టిలో పెట్టుకొని ‘హంట్’ ని యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. మరి ఈ హంట్ ఎలా సాగింది ? విజయాన్ని వేటాడటంలో సుధీర్ బాబు సక్సెస్ అయ్యాడా ?

అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు) హైదరాబాద్ లో అసిస్టెంట్ కమీషనర్. మోహన్ (శ్రీకాంత్) కమీషనర్. ఆర్యన్ (భరత్) అసిస్టెంట్ కమీషనర్. ఈ ముగ్గురూ డిపార్ట్ మెంట్ లో మంచి స్నేహితులు. అర్జున్, ఆర్యన్ ఒక మిషన్ పై దేశ సరిహద్దుల దాక వెళ్లి అక్కడ తీవ్రవాదులని అంతం చేస్తారు. ఈ మిషన్ లో ధైర్య సాహసాలు చూపిన ఆర్యన్, గవర్నర్ చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటాడు. అవార్డ్ తీసుకొని ప్ర‌సంగిస్తుండ‌గా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆర్యన్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఈ కేసుని మోహన్, అర్జున్ కి అప్పగిస్తాడు. కేసుని విచారించిన అర్జున్.. మర్డర్ చేసింది ఎవరో తెలుసుకుంటాడు. హత్య చేసిన వాడి పేరు మోహన్ కి చెప్పేలోగా అర్జున్ కారు యాక్సిడెంట్ కి గురి అవుతుంది. ఈ ప్రమాదంలో అర్జున్ తన గతం మర్చిపోతాడు. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ కేసు ని విచారించి హత్య చేసిన వాడిని పట్టుకునే భాద్యత మళ్ళీ అర్జున్ కే అప్పగిస్తాడు మోహన్. గతం మర్చిపోయిన అర్జున్.. ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు ఆర్యన్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వుంది ? అర్జున్ చివరికి హంతకుడిని పట్టుకున్నాడా ? అనేది మిగతా కథ.

తన గతం మర్చిపోయిన ఓ పోలీసు అధికారి కథ ఇది. మలయాళంలో విజయం సాధించిన ‘ముంబై పోలీస్’ కథని యాధావిధిగా తెలుగు ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం జరిగింది. అయితే మలయాళంలో ఈ సినిమా వచ్చి ఒక దశాబ్ధం కాలం గడిచింది. ఒక కథని ప్రేక్షకులు చూసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. పదేళ్ళ క్రితం సంచలనం అనుకునే అంశం.. ఈ రోజు కామన్ గా అనిపించవచ్చు. ముంబై పోలీస్ కథ చివర్లో ఒక సంచలనమైన ఎలిమెంట్ వుంది. అది మళ్ళీ తెలుగులో కూడా వర్క్ అవుట్ అవుతుందని నమ్మకంతో హంట్ తీశారు. కానీ ఆ సంచలనం తేలిపోయింది. నీరుగారిపోయింది.

ఒక మర్డర్ మిస్టరీగా కథ మొదలౌతుంది. మర్డర్ మిస్టరీలో బలమైన క్రైమ్ సీన్ వుండాలి. హంట్ లో క్రైమ్ సీన్ చాలా బల‌హీనంగా వుంటుంది. మర్డర్ కేసుని విచారణ చేస్తున్నపుడు వివిధ పాత్రలపై అనుమానాలు రేకెత్తించేలా సీన్లు అల్లుకోవాలి. ఇందులో కూడా అలాంటి అనుమానాలు వుంటాయి. కానీ అవి ఆసక్తికరంగా వుండవు. ప్రేక్షకుడి మెదడుకి కిక్ ఇచ్చే ఒక్క ఎపిసోడ్ కూడా ఇందులో లేదు. సీన్లు అన్నీ అలా సాగుతుంటాయి. అర్జున్, ఆర్యన్, మోహన్ ల మధ్య స్నేహం కోసం ప్రయత్నించిన సీన్స్ అన్నీ అసహజంగా వుంటాయి. ప్రేక్షకులని డైవర్ట్ చేయడానికి మధ్యలో ఒక తీవ్రవాద ముఠా ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. ఇదీ పెద్ద ఆసక్తికరంగా వుండదు. సెకండ్ హాఫ్ పై ఎలాంటి ఆసక్తి కలిగించకుండానే ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ మరీ బలహీనంగా తయారైయింది.

విరామం తర్వాత కూడా కేసు విచారణ ముందుకు సాగదు. నిజానికి ఇందులో విచారించడానికి కేసే లేదు. పదేళ్ళ కింద వచ్చిన కథని యాధావిది ఫాలో కావడం పెద్ద మైనస్. మలయాళం సినిమాలు సహజంగానే నిధానంగా సాగుతాయి. అలాంటిది పదేళ్ళ కింద వచ్చిన కథపై మరింత వర్క్ చేయాల్సింది. గతం మర్చిపోయిన అర్జున్.. ఈ కేసుని తన బ్రిలియన్స్ తో ముందుకి నడపడం, ఆ క్రమంలో అతని కొన్ని చిక్కులు ఎదురుకావడం, అవి సస్పెన్స్ ని క్రియేట్ చేయడం.. ఇలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చి వుంటే ఈ కథ మరోలా వుండేది. కానీ దర్శకుడు ఆ దిశగా అలోచించలేదు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ వుంటుంది. అది సరిపొతుందనే ధీమా కనిపించింది. నిజంగానే ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ వుంటుంది. అది అవుట్ అఫ్ ది బాక్స్ ఆలోచనే. అయితే పదేళ్ళ క్రితం ఆ ట్విస్ట్ లో సంచలనం వుందోమో కానీ ఇప్పుడు కాదు. కథకి అదే కీలకం కాబట్టి దానికి గురించి ఎక్కువ చెప్పడం లేదు కానీ.. నిజానికి ఆ ట్విస్ట్.. సుధీర్ బాబుకి వర్క్ అవుట్ కాలేదు.

సుధీర్ బాబు హంట్ కోసం ఒక సాహసమే చేశాడు. అయితే సినిమా చూసిన తర్వాత ఇది అనవసరమైన సాహసం అనిపిస్తుంది. సుధీర్ బాబు ఇమేజ్ కి సరిపడే ప్రయత్నం కాదిది. తన పాత్ర వరకూ చక్కగా చేసినప్పటికీ .. ఆ పాత్రని ప్రభావంతంగా మలచడంలో దర్శకుడి వైఫల్యం కనిపించింది. యాక్షన్ సీన్స్ లో పర్వాలేదనిపించాడు. శ్రీకాంత్, భరత్ పాత్రలు కూడా బలంగా లేవు. శ్రీకాంత్ పాత్రతో ప్రేక్షకులని మిస్ లీడ్ చేయాలనుకునే ప్రయత్నం కొంతమేరకు వర్క్ అవుట్ అయ్యింది. మైమ్ గోపి, గోపరాజు రమణ, మంజుల.. మిగతా నటులు పరిధిమేర చేశారు.

నిర్మాణ పరంగా సినిమా డీసెంట్ గా వుంది. జిబ్రాన్ నేపధ్య సంగీతం ఓకే. పార్టీ సాంగ్ పెద్దగా రిజిస్టర్ కాలేదు కానీ ఆ పాటలో అప్సర రాణి గ్లామర్ యాడ్ చేసింది. ఆరుళ్ విన్సెంట్ కెమరాపనితనం బావుంది. యాక్షన్ సీన్స్ అంత గొప్పగా లేవు. జాన్ విక్ కి పని చేసిన యాక్షన్ మాస్టర్స్ హంట్ కి పని చేశారని చెప్పారు కానీ ఆ ఎఫెక్ట్ అయితే ఇందులో కనిపించలేదు. పదేళ్ళ క్రితం సంచలనం అనుకున్న ఓ పాయింట్ నమ్ముకొని, కేవలం ఒక ట్విస్ట్ పై ఆదారపడిపోయి తీసిన ఈ హంట్.. సుధీర్ బాబు కోరుకునే విజయాన్ని ఇచ్చే చిత్రమైతే కాదు.

తెలుగు360 రేటింగ్ : 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close