వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌… రిలీజ్ ముందు టెన్ష‌న్‌!

సినిమా రిలీజ్ అంటే హీరో అభిమానుల‌కు ఎలా ఉంటుందో తెలీదు గానీ, నిర్మాత‌ల‌కు మాత్రం గుండె గుబేలుమంటుంది. అది కూడా రేపు రిలీజ్ అన‌గా… ఈ రోజు రాత్రి టెన్ష‌న్ మొద‌లవుతుంది. అడ్వాన్సులు ఇచ్చేవాళ్లు, పాత బాకీలు, క్లియ‌రెన్సులూ అన్నీ 24 గంట‌ల ముందే. ఓ ర‌కంగా నిర్మాత‌ల‌కు ఇది పురిటినొప్పుల స‌మ‌యం అనుకోవాలి.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కూడా ఇలాంటి పురిటి నొప్పుల‌నే అనుభ‌విస్తోంది ఇప్పుడు. కె.ఎస్‌.రామారావు నిర్మించిన సినిమా ఇది. బిజినెస్ హ్యాపీగానే జ‌రిగింది. అయితే పాత సినిమాల‌కు సంబంధించిన బాకీలు ఇప్పుడు ఈ సినిమాని టెన్ష‌న్ పెడుతున్నాయి. కె.ఎస్‌.రామారావుకి దాదాపు పాతిక కోట్ల వ‌ర‌కూ అప్పులున్నాయ‌ని టాక్‌. వాటికి సంబంధించిన క్లియ‌రెన్సులు కోసం బ‌య్య‌ర్లు ఇప్పుడు కె.ఎస్‌.రామారావు మీద ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఫైనాన్సియ‌ర్ స‌త్తు రంగ‌య్య ఇంట్లో సెటిల్‌మెంట్ వ్య‌వ‌హారాలు సాగుతున్నాయి. ఇవ‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తే త‌ప్ప‌.. ఈ సినిమాకి క్లియ‌రెన్స్ దొర‌కదు. ఏ క్ష‌ణంలో ఏదైనా జ‌ర‌గొచ్చు.. అనే వాతార‌వ‌ణం నెల‌కొందిప్పుడు. ఏదోలా పాత బాకీలు కొన్ని తీర్చేసి, కొంత‌మందికి స‌ర్దిచెప్పి ఈ సినిమాని బ‌య‌ట‌ప‌డేయాల‌ని కె.ఎస్‌.రామారావు భావిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com