ఏపీలో రిజిస్ట్రేషన్ అంటే సర్కస్ ఫీటే !

ఏపీలో మరోసారి రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లు మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దశమి మంచి రోజు కావడంతో సోమవారం ఉదయం నుండి భూములు, భవనాల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు జనం పొటెత్తారు. కానీ అసలు పని జరగలేదు. అందరూ మంగళవారం రండి అని అధికారులు.. మంగళవారం కబుర్లు చెప్పి పంపించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు పలుచోట్ల రిజిస్ట్రార్లతో వాగ్వాదానికి దిగారు.

రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. సాధారణంగా డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్లకు ఈకేవైసీ ఒక్కసారి చేస్తారు. కార్డుప్రైమ్‌ విధానంలో రెండుసార్లు చేయాలి. ఈకేవైసీ సర్వర్‌ సమస్య జిల్లావ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తీవ్రంగా ఉంది. ఇక, ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవు. వీరి వేలిముద్రనే సంతకంగా పరిగణిస్తున్నారు. ఈ విధానంలో డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్లకు ఎక్కువ సమయం పడుతోంది. తరచూ సర్వర్లు డౌన్ అవుతున్నాయి.

కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి. లేదా నెట్‌సెంటర్‌ నిర్వాహకులను ఆశ్రయించాలి. డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్‌ కావాలి. అందులో ఏ రకమైన డీడ్‌ రాయించుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఫార్మేట్‌ను ఎంపిక చేసుకుని, ఆ వివరాలు నమోదు చేసి, దానిని సబ్‌రిజిస్ట్రార్‌కు లింక్‌ రూపంలో పంపించాలి. దానిని సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించిన తర్వాత అందులో ఏవైనా తప్పులను సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారుడికి సబ్‌రిజిస్ట్రార్‌ మెయిల్‌ ద్వారా లింక్‌ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్‌ ద్వారానే మరలా సబ్‌రిజిస్ట్రార్‌కు పంపితే, దానిని ఆయన ఓకే చేసినతర్వాతే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్ళి వేలిముద్ర వేయాల్సివుంటుంది. ఈ ప్రాసెస్ లో సర్వన్ డౌన్ అయితే పని కావడం లేదు.

ప్రజలకు నరకం చూపించాలంటే ఏం చేయాలో జగన్ రెడ్డి పాలనలో ఉన్న విధానాలను చూసి తెలుసుకోవాలని ప్రజలు కూడా నీరసపడిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close