హైదరాబాద్లోని ఓ పెంపుడు కుక్క తన యజమానిని చంపేసింది. మధురానగర్లో పవన్ కుమార్ అనే యువకుడు ఓ విదేశీ జాతి కుక్కను పెంచుకుంటున్నాడు. దాన్ని కుటుంబసభ్యుడిలాగా చూసుకుటున్నారు. పవన్ కుమార్ పడుకునే మంచం మీదనే అది కూడా పండుకుంటుంది. అయితే ఏం జరిగిందో కానీ.. రాత్రి ఆ కుక్క పవన్ కుమార్ ప్రైవేటు పార్ట్స్ ను కొరికి చంపేసింది. వృషణాలను పూర్తిగా కొరికి తెంపేయడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. అతని అరుపులు కూడా బయట వారికి వినిపించలేదు.
కుక్క దాడి చేసిన సమయంలో పవన్ కుమారే ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఉదయం పవన్ స్నేహితుడు వచ్చి డోర్ బెల్ చాలా సార్లు మోగించినా స్పందన లేదు. దాంతో చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి తలుపులు పగులగొట్టి చూశారు. లోపల కుక్క నోటి నిండా రక్తంతో ఉంది. పవన్ కుమార్ ప్రైవేటు పార్ట్స్ లేవు. దాంతో ఆ కుక్క పవన్ కుమార్ ప్రైవేటు పార్టుల్ని కొరికేసిందని అంచనాకు వచ్చారు.
అయితే పెంపుడు కక్క ఆ పని చేసిందా లేకపోతే ఎవరైనా ఆ పని చేసి.. ప్లాన్డ్ గా కుక్క మీద తోసేందుకు ఆలా చేశారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలకు పళ్లల్లో పదును తగ్గించేస్తారు. అలా కరిచేలా ఉంటే ఇంట్లో ఉంచుకోరు. ఇంత దారుణంగా సరిగ్గా తెలిసినట్లుగా మర్మాంగాలపైనే పెంపుడు శునకం దాడి చేస్తుందా.. అన్న దానిపై పరిశీలనలు చేయాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.