హైదరాబాద్లో ఇంటి అద్దెలు వేగంగా పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే వెస్ట్ ప్రాంతం కిందకు వచ్చే ఐటీ కారిడార్ లో ఇళ్ల అద్దెలు సామాన్యులు భరించలేనంతగా మారాయి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రైమ్ ప్రాంతాల్లో 2BHK రెంట్ 40 వేలు, 3BHKలు 50 వేలు పైగా చేరాయి. ANAROCK రిపోర్ట్ ప్రకారం, 2021-2024 మధ్య హైటెక్ సిటీలో రెంటల్స్ 54% పెరిగాయి, గచ్చిబౌలిలో 62% పెరిగింది.
ఐటీ ఉద్యోగులు, NRIs డిమాండ్ వల్ల బెంగళూరు, పూణెలతో పోటీ పడుతున్నాయి. మరోవైపు, ఉప్పల్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో రెంట్స్ తక్కువగా ఉన్నాయి. 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత కాస్త స్తబ్దుగా ఉన్నా 2021-24 మధ్య ఆస్తుల విలువలు 128 శాతం పెరిగాయి, రెంటల్స్ 50 శాతానికి పెరిగాయి. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో రెంట్స్ బాగా తక్కువగా ఉన్నాయి. పది నుంచి ఇరవై వేల లోపు డబుల్ బెడ్ రూం ఇళ్లు లభిస్తున్నాయి.
బేగంపేటలో రూ.20,000 నుంచి రూ. 40,000 .. కూకట్ పల్లిలోనూ అదే ధరలో లభిస్తున్నాయి. ఉప్పల్, మియాపూర్లో 10-15 శాతం అద్దెలు పెరుగుతున్నాయి. 2025లో సప్లై పెరగడంతో ఈ ఏరియాల్లో రెంట్స్ స్టెబిలైజ్ అవుతాయని అంచనా. ఉప్పల్, మియాపూర్ను “బడ్జెట్ ఫ్రెండ్లీ, లివబుల్” అని ఎక్కువ మంది ఓటు వేస్తున్నారు.