తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050 ఈ నెల చివరి నాటికి విడుదల చేయనుంది. ఈ మహా ప్రణాళిక ద్వారా రాష్ట్ర రాజధాని 25 సంవత్సరాల అభివృద్ధి మార్గదర్శకంగా మారనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరిధిలో 11,328 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఈ మాస్టర్ ప్లాన్ కవర్ చేస్తుంది.
HMDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ , యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ను ఇంటిగ్రేట్ చేస్తూ, సిటీని నాల్గవ అర్బన్ హబ్‌గా డెవలప్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. GO 111 అంశంపై గందరగోళం ఉంది. హిమయత్సాగర్ , ఒస్మాన్సాగర్ చుట్టూ 83 గ్రామాల్లో నిర్మాణాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కేసీఆర్ హయాంలో జీవోను రద్దు చేశారు. కానీ అమల్లో ఉందా లేదా అన్నది అర్థం కావడం లేదు.
మాస్టర్ ప్లాన్ లో ఈ జీవోపై క్లారిటీ వస్తుందని ఎక్కువ మంది ఆశాభావంతో ఉన్నారు. ఇది లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడిపడి ఉన్న ప్రాంతం. అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా గందరగోళానికి తెర దించుకుందని.. అనుకుంటున్నారు. GO 111 ప్రాంతంలో అన్‌లాక్ అయ్యే ల్యాండ్‌ను డెవలప్మెంట్కు అనుకూలం చేస్తుంది. GO 111ను పూర్తిగా రద్దు చేయకుండా, సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్ ద్వారా బ్యాలెన్స్ చేయాలన్న సూచను కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మాస్టర్ ప్లాన్‌లో తేలే అవకాశం ఉంది.