హైదరాబాద్ లోని నాలుగు జోన్లలో ఐటీకారిడార్ ఉన్న వెస్ట్ జోన్ హాట్ ప్రాపర్టీ. అందులో సందేహమే లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే అందరూ వెస్ట్ జోన్ గురించే చెబుతారు. ఆలోచిస్తారు. దానికి తగ్గట్లుగానే ఆ ప్రాంతానికి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 50 శాతానికిపైగా భాగం ఉంది. తర్వాత నార్త్ జోన్ … మూడవ స్థానంలో సౌత్ జోన్ ఉంది. అంటే ఇరవై శాతంలోపే అక్కడ లావాదేవీలు జరుగతున్నాయి.
కానీ దక్షిణ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు , మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్ .. ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోకేవస్తాయి. విజయవాడ, శ్రీశైలం రహదారుల వెంట రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి, ఇక్కడ స్థలాలు, ఇండిపెండెంట్ ఇళ్ల ప్లాట్లు, విల్లాల నిర్మాణం జరుగుతోంది.
హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ జోన్లో అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు రూ. ఏడు వేల వరకూ ఉంటోంది. ఇది నగరంలోని ఇతర జోన్లతో సమానంగా ఉంది. దీనికి కారణం రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ నంబర్ వన్ రియల్ ఎస్టేట్ హబ్‌గా మారే అవకాశం ఉండటమే. వెస్ట్ జోన్ తో సమానంగా డిమాండ్ పెంచుకుంటుందని అంచనావేస్తున్నారు.
దక్షిణ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్థిరమైన వృద్ధిని కలిగి ఉంటుందని.. మరియు రాబోయే సంవత్సరాల్లో మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని అంచనా. అందుకే పెట్టుబడులు అటు వైపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.