జూబ్లీహిల్స్ టానిక్ లిక్కర్ మార్ట్ మూత

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని లగ్జరీ లిక్కర్ మార్ట్ టానిక్ వైన్ షాప్ ని ఎక్సైజ్ అధికారులు మూసి వేయించారు. ఈ దుకాణానికి ఉన్న లైసెన్స్ గడువు ఆదివారంతో ముగిసిపోయింది. లైసెన్స్ పొడిగించాలని దుకాణం యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సాధ్యం కాదని పొడిగించలేదు.. దీంతో ఎక్సైజ్ పోలీసులు వచ్చి మూసి వేయిచారు.

టానిక్ లిక్కర్ మార్ట్ స్పెషల్ జీవోతో గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ లోని కొంత మది కీలక వ్యక్తుల బినామీ వ్యాపారమన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన లిక్కర్ దుకాణంలో సోదాలు నిర్వహిచారు. పన్నుల చెల్లింపులో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన కమర్షియల్ టాక్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు టానిక్ లిక్కర్ మార్ట్ కు అనేక వెసులుబాట్లు గత ప్రభుత్వం. ఇచ్చింది. విదేశీ మద్యాన్ని అయినా తెచ్చుకునే వెసులుబాటు కల్పించింది.

టానిక్ వైన్స్ లో కోటిన్నరకు పైగా విలువ చేసి మద్యం ఉంటుంది అని అంచనా వేశారు. వాటిని సమీప షాపులకు పంపిస్తున్నారు. ప్రపంచంలోని ఎంత ఖరీదైన బ్రాండ్ మద్యం అయినా ఇక్కడ లభిస్తుంది. ఎక్కడి నుంచి అయినా మద్యం తెచ్చుకునే వెసులు బాటు కల్పించడంతో ఈ దుకాణం వ్యాపారం కోట్లలోనే సాగేది. మొత్తంగా టానిక్ ను మూతపడేలా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: జీతూ జోసెఫ్ క్రైమ్ కామెడీ నవ్వించిందా?

సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ తీసే దర్శకుడు జీతూ జోసెఫ్. ఆయన సినిమాలకి ఒక కల్ట్ ఫాలోయింగ్ వుంది. దృశ్యం సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదరించారు. ఇప్పుడాయన నుంచి ఓ క్రైమ్ కామెడీ వచ్చింది....

కోడి రామ్మూర్తి నాయుడుగా రామ్‌చ‌ర‌ణ్‌?

రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు ఈ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది....

బాచుపల్లిలో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇళ్లు !

బాచుపల్లి అంటే అమ్మో కాస్ట్ లీనా అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఒకప్పుడు అబ్బో బాచుపల్లినా అంత దూరం ఎవరు వస్తారు అనుకునేవారు. ఒకప్పుడు అంటే.. ఎంతో కాలంకిందట కాదు.. జస్ట్ పదేళ్ల...

సెప్టెంబర్ 17 ఓన్లీ నిమజ్జనం డే !

సెప్టెంబర్ 17 అంటే.. తెలంగాణ రాజకీయాలకు ఓ ఊపు వస్తుంది. దాదాపుగా నెల రోజుల ముందు నుంచే మాటల మంటలు ప్రారంభమవుతాయి. ఆ రోజున వారి వారి పార్టీల విధానాలకు అనుగుణంగా కార్యక్రమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close