హైడ్రాతో జూబ్లిహిల్స్ ఎన్నికలను గట్టెక్కాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలను చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా వస్తుందని మీ ఇళ్లను కూల్చివేస్తుందన ఓటర్లను భయపెట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున హైడ్రా బాధితుల పేరుతో కొంతమందిని తీసుకు వచ్చి వారి బాధల్ని వినిపించారు. అందులో చిన్న పిల్లలు, వికలాగంలు,మహిళలు ,అనాధలు ఇలాంటి సమీకరణాల్ని చూసుకున్నారు. ఆ వీడియోలు వీలైనంతగా జూబ్లిహిల్స్ ప్రజలకు పంపుతారు. అంత వరకూ బాగానే ఉంది కానీ జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ఓస్తే హైడ్రా మాత్రం రాకుండా ఉంటుందా అన్న డౌట్ ప్రజలకు వస్తే సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నేతల వద్ద సమాధానం లేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి వద్ద ఉంది.
ఓడితేనే హైడ్రా వస్తుంది.. గెలిస్తే రాదు !
జరుగుతోంది జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక మాత్రమే. ఆ ఉపఎన్నిక సీటు కాంగ్రెస్ పార్టీ బలంపై ఎలాంటి ప్రభావం చూపదు. గెలిస్తే ఓ సీటు పెరుగుతుంది. కానీ ఓడిపోతే తగ్గదు. ఎందుకంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఈ ఎన్నికల వల్ల ప్రభుత్వంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీని గెలిపించినా హైడ్రా చేయాలనుకుంటే తమ పనులు చేసేస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచే ఎమ్మెల్యే కూడా ఆపలేరు. తాము ఆపగలుగుతామని కూడా బీఆర్ఎస్ చెప్పడం లేదు. అక్కడే అసలు పాయింట్ ఉంది. కేవలం భయపెట్టి ఓట్లు పొందాలనుకుంటున్నారు. అంతకు మించిన ఆలోచన ప్రజలు చేస్తారని అనుకోవడం లేదు.
కాంగ్రెస్ ను ఓడించడం రెచ్చగొట్టడమే అని ఓటర్లు అనుకుంటే అంతా రివర్స్
ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెచ్చగొడితే రేపు తమ ఇళ్ల మీదకు హైడ్రాను తీసుకు వస్తే ఎవరు అండగా ఉంటారన్న ప్రశ్న బీఆర్ఎస్ ప్రచారం వల్ల ప్రజలకు వస్తుంది. అప్పుడు వారికి కనిపించే సమాధానం… కాంగ్రెస్ ను ఓడించడం ఎందుకు.. ఓ ఓటు వేస్తే పోలా అని. ఒక వేళ ఓటు వేసిన తర్వాత కూడా హైడ్రా వస్తే వారికి నవీన్ యాదవ్ ఉంటారు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్. రాత్రికి రాత్రి వచ్చిన నేత కాదు. అక్కడ ప్రతి బస్తీలోనూ.. ఆయనకు అనుచరగణం..బలం ఉంటుంది. కాబట్టి ఆయన కాపాడుతారనే నమ్మకం ఉంటుంది.
బీఆర్ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్ వాడుకుంటుందా?
నిజానికి జూబ్లిహిల్స్ లో హైడ్రాకు పని ఉండదు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. చెరువును కబ్జా చేస్తే మాత్రం హైడ్రా వెళ్తుంది. జూబ్లిహిల్స్ మొత్తం కిక్కిరిసిపోయిన జనవాసాల కాలనీలే ఉంటాయి. ఏదైనా సమస్య ఉంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది కానీ.. హైడ్రా వరకూ వెళ్లలేదు. కానీ బీఆర్ఎస్ లోతుగా ఆలోచించలేక.. పూర్తిగా హైడ్రాను ఆయుధంగా చేసుకుంటుంది. ప్రజలు తమ జోలికి హైడ్రా రాకుండా ఉండాలంటే..కాంగ్రెస్కు ఓటేయడం బెటర్ అనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయినట్లే. అయితే కాంగ్రెస్ ఎలా వాడుకుంటుది అన్నదానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది.
