కొన్ని నెలలుగా భాగ్యనగరంలో హైడ్రా పేరు మారుమోగుతోంది. చెరువుల పునరుద్ధరణ, కబ్జాల తొలగింపు లక్ష్యంగా ఏర్పాటైన ఈ సంస్థ, ప్రతివారం వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడామని గణాంకాలతో సహా ప్రకటిస్తోంది. తాజా లెక్కల ప్రకారం, ఇప్పటివరకు సుమారు 1,000 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకున్నామని, దీని బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 65,000 కోట్లకు పైమాటేనని హైడ్రా ప్రకటించుకుంది.
ప్రచారాలు vs వాస్తవాలు
హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల్లో ఎక్కువ భాగం చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్లలో ఉన్నాయి. పర్యావరణ నిబంధనల ప్రకారం వీటిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కాబట్టి, ఈ భూములను వేలం వేయడం లేదా అమ్మడం అనేది చట్టపరంగా సాధ్యం కాదు. హైడ్రా ప్రధాన ఉద్దేశం భూములను కాపాడి ప్రకృతికి అప్పగించడమే కానీ, వ్యాపారం చేయడం కాదు. వాటికి విలువ కట్టలేరు. గాజులరామారం, కొండాపూర్, బంజారాహిల్స్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నారు.కానీ అవి వివాదాల్లో ఉన్నాయి. బోర్డు పెట్టినంత మాత్రాన ప్రభుత్వ సొంతమయ్యే అవకాశం లేదు.
అలా అయితే వేలం వేసుకోవచ్చుగై!
హైడ్రా వేసిన లెక్కల ప్రకారం వేలం వేసుకుంటే రేవంత్ సర్కార్కు ఆర్థిక సమ్యస్యలు తప్పినట్లే. హైడ్రా రక్షించినట్లుగా ప్రకటించిన ప్రభుత్వ భూములను అమ్ముకుంటే ఖజానాకు వేల కోట్లు చేరడం ఖాయం. కానీ, ఈ భూముల్లో చాలా వరకు కోర్టు కేసులు ఉండటం, హక్కుల వివాదాలు కొనసాగుతుండటం వల్ల తక్షణమే వేలం వేయడం సవాలుతో కూడుకున్న పని. హైడ్రా చర్యలు కేవలం కూల్చివేతలకు మాత్రమే పరిమితం కాకుండా, స్వాధీనం చేసుకున్న భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడం , ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టడం చేస్తోంది. ఇలాంటివి చేయడాన్ని ఆయన భూములు క్లెయిమ్ చేసుకుంటున్నవారు తప్పు పడుతున్నారు. కోర్టు తీర్పులను హైడ్రా ధిక్కరిస్తోందని ఆరోపిస్తున్నారు.
హైడ్రాది పబ్లిసిటీ స్టంట్
హైడ్రాది పబ్లిసిటీ స్టంట్ అనే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. వీకెండ్ లో ఏదోక ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి వేల కోట్ల భూముల్ని కాపాడేశాం అని ప్రకటించుకుంటోంది. ప్రచారం చేసుకుంటోంది. కానీ చాలా ఆక్రమణలు ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తున్నా..కన్నెత్తిచూడటం లేదు. ఓవైసీ కాలేజీ నుంచి మూసిలోని ఆదిత్య బిల్డింగ్ వరకూ చాలా ఉన్నాయి. వీటిని పట్టించుకోవడంలేదు కానీ.. కోర్టుల్లో ఉన్న వాటిని మాత్రం రాత్రికి రాత్రి స్వాధీనం చేసుకుని అందులో ఉన్న వాటిని కూలగొట్టేస్తున్నారు.
