పైరసీ వెబ్సైట్ ఐ-బొమ్మ వెనుక మాస్టర్‌మైండ్ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో బయటకొస్తున్న వివరాలు షాకింగ్‌గా ఉన్నాయి. కరీబియన్ దీవుల్లో దాక్కొని సినిమాకి పైరసీ పులి గా మారిన రవి విశాఖ వాసి. కూకట్‌పల్లిలో ఉన్న అతడి ఫ్లాట్‌పై జరిపిన సోదాల్లో హార్డ్ డిస్క్‌లు, హై-ఎండ్ కంప్యూటర్లు, ఇంకా విడుదల కాని సినిమాల హెచ్డీ ప్రింట్లు దొరికినట్లు తెలుస్తోంది.
పైరసీ ద్వారా రవి ఇప్పటివరకు వందల కోట్లు మింగేశాడట. ఇదే సమయంలో సినీ ఇండస్ట్రీకి ఐ-బొమ్మ వల్ల గత కొన్నేళ్లుగా ఏకంగా రూ. 22,000 కోట్ల నష్టం జరిగిందని విచారణలో తేలింది. ఈ మొత్తం పైరసీ సామ్రాజ్యాన్ని నిజంగా రవి ఒక్కడే నడిపాడా? ఇతని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది? ఎంత పెద్ద మాఫియా ఉంది? ఈ ప్రశ్నలన్నింటిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పూర్తి విచారణ తర్వాత పోలీసులు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం వుంది.


