బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇండియాలో ఆడేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. భద్రతా కారణాల పేరుతో రాజకీయం చేయబోయిన బంగ్లాదేశ్‌కు ఐసీసీ కోలుకోలేని దెబ్బుకొట్టింది. తమ మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలన్న ప్రతిపాదనను ఐసీసీ తోసిపుచ్చింది. అంతే కాదు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక్క రోజు గడువును విధించింది. రాబోయే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తమ జట్టును భారత్‌కు పంపిస్తారో లేదో ఒక్క రోజులోనే తేల్చి చెప్పాలని ఐసీసీ స్పష్టం చేసింది.
భద్రతా పరమైన కారణాలు లేదా ఇతర రాజకీయ కారణాల వల్ల బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని భావిస్తే, ఆ విషయాన్ని వెంటనే తెలియజేయాలని ఆదేశించింది. ఒకవేళ భారత్‌కు వచ్చేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తే, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును ప్రత్యామ్నాయంగా టోర్నీలోకి తీసుకోవాలని ఐసీసీ ఇప్పటికే నిర్ణయించింది. మెగా టోర్నీ షెడ్యూల్, ఏర్పాట్లకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఐసీసీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రేపటిలోగా బంగ్లాదేశ్ బోర్డు ఇచ్చే సమాధానంపైనే ఆ జట్టు ప్రపంచకప్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు భారత్ కు రావడానికి బంగ్లా వెనక్కి తగ్గితే ఆ దేశక్రికెట్ చాలా నష్టపోతుంది. కాంట్రాక్టులు, స్పాన్సర్ షిప్‌లు తగ్గిపోతాయి. ఆదాయం పడిపోయి ఆ దేశ క్రికెట్ నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. భారత్ పై అకారణ ద్వేషం పెంచే అక్కడి రాజకీయాలకు బంగ్లా క్రికెట్ నాశనం అవుతోంది.
