చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి లక్ష్మిపార్వతి వెనుకడుగు..!

చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని.. ఏసీబీతో విచారణ చేయించాలని.. లక్ష్మిపార్వతి.. పదిహేనేళ్ల కిందట పిటిషన్ వేసింది. ఇప్పుడు.. ఆ కేసు విచారణకు ఆమె ముందుకు రావడం లేదు. అమె స్వయంగా కోర్టుకు హాజరై.. సాక్ష్యాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ.. కోర్టు ముందుకు వచ్చేందుకు ఆమె సిద్ధంగా లేరు. ఇప్పటికే.. రెండు, మూడు వాయిదాలు పడిన ఆ కేసు.. లక్ష్మిపార్వతి రాని కారణంగా మరో సారి వాయిదా పడింది. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన నందమూరి లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా.. ఆమె తన తరఫున సీనియర్‌ న్యాయవాది హాజరవుతారని, అప్పటి వరకూ కేసు విచారణను వాయిదా వేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు.

దాంతో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. చంద్రబాబుపై.. లక్ష్మిపార్వతి 2005లో ఈ పిటిషన్ వేశారు. అప్పట్లో ఈ కేసు విషయంలో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టే పై ఎటువంటి పొడిగింపు లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలం అయినందున.. కేసు విచారణను కొనసాగంచాలా.. పిటిషన్ ఉపసంహరించుకుంటారా.. అని ఓ సందర్భంలో కోర్టు లక్ష్మిపార్వతిని ప్రశ్నించింది.

దానికీ కూడా ఆమె.. స్పష్టమైన సమాచారాన్ని.. కోర్టుకు ఇవ్వలేదు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని సూచిస్తూ కేసును గతనెల 25 వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడు కూడా.. లక్ష్మిపార్వతి ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా.. అదే పరిస్థితి. అసలు పిటిషన్ వేసిన లక్ష్మిపార్వతి ఇప్పుడు కూడా కోర్టు ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. తన తరపున సీనియర్ లాయర్‌ను పంపుతాననే.. చెబుతున్నారు కానీ.. తాను హాజరవుతానని చెప్పడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close