ఇళ‌య‌రాజా.. ఓ హార్మోనియం పెట్టె క‌థ‌!

ఇళ‌య‌రాజా.. స్వ‌ర‌జ్ఞాని. ద‌శాబ్దాలుగా సంగీత ప్రియుల సేద తీరుస్తున్న‌ స‌ప్త స్వ‌రాల స‌ముద్రం. ద‌క్షిణాదినే కాదు, త‌న స్వ‌రాల‌తో ఉత్త‌రాదినీ మంత్ర ముగ్థుల్ని చేసిన అద్భుత‌మైన క‌ళాకారుడు. ఏళ్ల త‌ర‌బ‌డి.. దాచుకొని మ‌రీ విన‌గ‌లిగే ఎన్నో గొప్ప పాట‌ల్ని ఆస్తులుగా అందించారాయ‌న‌. ఇప్పుడు ఆయ‌న క‌థ వెండి తెర‌పైకి వ‌స్తోంది. ఇళ‌య‌రాజా బ‌యోపిక్‌ను అదే పేరుతో తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇళ‌య‌రాజా పాత్ర‌లో ధ‌నుష్ న‌టించ‌నున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ప‌ట్టాలెక్కింది. అరుణ్ మ‌తేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్ట‌ర్ ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఓ హార్మోనియం పెట్టెతో, మ‌ద్రాసు మ‌హాన‌గ‌రంలో అడుగు పెట్టిన ఇళయ‌రాజా చిత్రాన్ని.. పోస్ట‌ర్ గా తీసుకొచ్చారు.

ఇళ‌య‌రాజా క‌థంటే.. కేవ‌లం అత‌ని చ‌రిత్ర మాత్ర‌మే కాదు. ఆయ‌న ప‌నిచేసిన ద‌ర్శ‌కులు, అవ‌కాశం ఇచ్చిన గాయ‌నీ గాయ‌కులు, ఆయ‌న‌తో పాటుగా ఎదిగిన మ‌రికొంత‌మంది క‌ళాకారుల క‌థ కూడా. ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, మ‌ణిర‌త్నం, వంశీ పాత్ర‌ల‌కూ ఈ క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర ఉంది. మ‌రి ఆయా పాత్ర‌ల్లో ఎవ‌రు క‌నిపిస్తారో చూడాలి. ఇళ‌య‌రాజాని అభిమానించ‌ని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. ఆ ర‌కంగా చూస్తే… అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించ‌గలిగే శ‌క్తి.. ఈ క‌థ‌కు ఉన్న‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close