క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది. చివరికి అతన్నే హతమార్చింది. ఉప్పల్ రామాంతపూర్‌లోఈ ఘటన జరిగింది. ఉప్పల్ రామంతాపూర్‌ శ్రీనగర్ కాలనీలో హత్య జరిగిందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెళ్లి చూసిన పోలీసులకు కత్తిపోట్లకు గురైన ఓ యువకుడి రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది.

ఆ కత్తిపోట్లు పొడిచింది అనిత అనే మహిళ. అమెను అదుపులోకి తీసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. చనిపోయిన నవీన్ .. అపరిచితుడు కాదు.. అల్లుడే. మరి ఎందుకు చంపాల్సి వచ్చింది…అంటే కుటుంబగొడవలు. ఆ గొడవలు వచ్చింది.. అత్త, అల్లుడి మధ్య వివాహేతర బంధం వల్ల. క్యాటరింగ్ బిజినెస్ చేసే నవీన్ కు అనిత అనే మహిళ పరిచయం అయింది. అనితకు భర్త లేకపోవడం తో నవీన్ తో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. తర్వాత కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత తల్లితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న కూతురు వందన ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నవీన్, అనిత జైలుకు వెళ్లొచ్చారు.

జైలుకు వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ రామాంతపూర్ శ్రీనగర్ కాలనీ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం కొనసాగిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ.. ఇంట్లో వాడుకునే కత్తి తో నవీన్‌ను దారుణంగా పొడిచి చంపింది అనిత.నవీన్ బాడీ పై 16 కత్తి పోట్లు ఉన్నట్లు క్లూస్ టీమ్ గుర్తించింది. అనైతిక బంధాలు అంతిమంగా అనర్థాలకే దారి తీస్తాయని.. ఈ కేసు మరోసారి నిరూపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ద‌ర్శ‌కేంద్రుడితో… స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌

కె.రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ధారి. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు...

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

HOT NEWS

[X] Close
[X] Close