IMDb పాపుల‌ర్ మూవీస్… టాప్ 10 లిస్ట్ ఇదే!

2022 క్యాలెండ‌ర్ చివ‌రికి వ‌చ్చేశాం. ఇప్పుడు 2022 ఇచ్చిన జ్ఞాప‌కాల్ని నెమ‌రేసుకొనే ప‌నిలో ఉన్నాం. ఈలోగా.. IMDb టాప్ 10 పాపుల‌ర్ సినిమాల లిస్టుని ప్ర‌క‌టించేసింది. టాప్ 1 స్థానాన్ని అంద‌రూ ఊహించిన‌ట్టే.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సొంతం చేసుకొంది. 2022లో మోస్ట్ పాపుల‌ర్ మూవీగా IMDb ఆర్‌.ఆర్‌.ఆర్‌కి నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని క‌ట్ట‌బెట్టింది. 2వ స్థానంలో ‘క‌శ్మీర్ ఫైల్స్‌’ ద‌క్కించుకొంది.టాప్ 3 లిస్టులో కేజీఎఫ్ 2 నిలిచింది. 4, 5, 6 స్థానాల్లో ‘విక్ర‌మ్‌’, ‘కాంతారా’, ‘ది నంబి ఎఫెక్ట్’ ఉన్నాయి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో పాటు మ‌రో రెండు తెలుగు చిత్రాల‌కు ఈ లిస్టులో చోటు ద‌క్క‌డం విశేషం. ‘మేజ‌ర్’ (7), ‘సీతారామం ‘(8) స్థానాల్లో నిలిచాయి. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ‘పొన్నియ‌న్ సెల్వ‌న్ 1’, ‘చార్లి 777’ చివ‌రి రెండు స్థానాల్ని కైవ‌సం చేసుకొన్నాయి. ఈ టాప్ 10 చిత్రాల‌న్నీ.. క‌మ‌ర్షియ‌ల్‌గానూ పెద్ద విజయాన్ని అందుకోవ‌డం విశేషం. టాప్ 10లో 9 సౌత్ ఇండియ‌న్ సినిమాలే! క‌శ్మీర్ ఫైల్స్ బాలీవుడ్ సినిమానే అయినా.. తీసింది మాత్రం తెలుగు నిర్మాత‌లే.

IMDb టాప్ 10 సినిమాల జాబితా

1. ఆర్‌.ఆర్‌.ఆర్‌
2. క‌శ్మీర్ ఫైల్స్‌
3. కేజీఎఫ్ 2
4. విక్ర‌మ్‌
5. కాంతారా
6. ది నంబి ఎఫెక్ట్‌
7. మేజ‌ర్‌
8. సీతారామం
9. పొన్నియ‌న్ సెల్వ‌న్‌
10. చార్లి 777

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close