ఆర్టీసీ విలీనం : చంద్రబాబు అసాధ్యమన్నది జగన్ చేసి చూపించారు..!

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమా..? అదెలా సాధ్యం..!.. ఈ మాటలు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర్నుంచి ఆర్టీసీ చైర్మన్ గా పని చేసిన వర్ల రామయ్య వరకూ అందరూ చేశారు. కానీ.. వైసీపీ సర్కార్.. మూడు నెలల్లోనే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అడుగులు వేసింది. ఎన్నికలకు ముందు అసాధ్యం అని ప్రకనటలు చేసిన.. తెలుగుదేశం పార్టీ నేతలకూ షాక్ ఇచ్చింది. విలీన నిర్ణయాన్ని ప్రకటించింది. మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తారు.

ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థే కానీ.. ప్రభుత్వంలో భాగం కాదు. కార్పొరేషన్ కింద పని చేస్తూ ఉంటుంది. సొంత వ్యవస్థ ఉంటుంది. లాభాలు, నష్టాలు .. ఏదైనా ఏపీఎస్ఆర్టీసీనే భరించాల్సి ఉంటుంది. జీతాలు కూడా.. ఆ సంస్థ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారమే ఇస్తారు. ఫిట్‌మెంట్, పీఆర్సీలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. కానీ.. జగన్మోహన్ రెడ్డి… ఆర్టీసీని నేరుగా ప్రభుత్వంలో విలీనం చేసేస్తున్నారు. కాబట్టి… వారు ఇక ప్రభుత్వ ఉద్యోగులే. సంస్థ లాభనష్టాలు మొత్తం ప్రత్యక్షంగా ప్రభుత్వ ఖాతాలోకి చేరిపోతాయి. అప్పుడు.. ఆ సంస్థ నష్టాలను ప్రభుత్వమే భరిస్తుంది. ఉద్యోగులకు… పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా.. అన్ని రకాల సౌకర్యాలు అందుతాయి. ఫిట్‌మెంట్, పీఆర్సీ, వేతన సవరణలు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వస్తాయి.

52 వేల మంది కార్మికులు ఆర్టీసీలో పని చేస్తున్నారు. 63 ఏళ్ల నుంచి కష్టనష్టాలను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అవుతోంది. దీంతో ఇక ఆర్టీసికి కష్టాలు తీరినట్లేనని కార్మికులు భావిస్తున్నారు. ఆర్టీసీ ఖాళీ స్థలాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు ఇక ప్రభుత్వ పరిధిలోకి వెళతాయి. ఆర్టీసీ అప్పులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ.6 వేల కోట్ల దాకా అప్పులు ఉన్నాయి. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలను.. వీలైనంత వరకు.. ముఖ్యంగా నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలను తగ్గించుకోవాలని.. ప్రభుత్వాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ కార్మికుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి సర్కార్… ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లో విలీనం ప్రక్రియ పూర్తయిపోతుంది. ప్రభుత్వంలో విలీనం పూర్తయిన తర్వాతా .. ఇక ప్రైవేటు బస్సులు అద్దెకు తీసుకునే విధానం ఉండదు. కష్టనష్టాలు ఎదురైనా… జగన్ అనుకున్నది చేసి చూపించారు. టీడీపీ అసాధ్యమన్నది వైసీపీ సునాయాసంగా చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com