రాజస్థాన్ లో రూ.13,000 కోట్లు నల్లధనం స్వాధీనం!

విదేశాలలో నల్లధనం వెనక్కి రప్పించే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విదేశాలలో నల్లధనం దాచుకొన్నవారు స్వచ్చందంగా ఆ వివరాలను బయటపెట్టి, దానిపై 30శాతం జరిమానా, మరో 30 శాతం పన్ను చెల్లించి శిక్ష పడకుండా తప్పించుకొనే వెసులుబాటు కల్పించింది. గతేడాది జూలై 1వ తేదీ నుండి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువులో మొత్తం 638 మంది స్వచ్చందంగా తమ నల్లధనం వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు సమర్పించి మొత్తం రూ.3, 770 కోట్లు చెల్లించారు.

ఆ మరునాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తమ నల్లధనం వివరాలను బయటపెట్టి పన్నులు, జరిమానాలు చెల్లించినవారందరూ ఇకపై నిశ్చింతగా నిద్ర పోవచ్చును. కానీ మిగిలినవారు మాత్రం మా ప్రభుత్వం చేపట్టబోయే కటినమయిన చర్యలు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండక తప్పదు. ఇక నుండి నల్లధనం దాచినవారికి 10 ఏళ్ల జైలు శిక్ష దానితో బాటు వారు దాచిన నల్లధనంపై 120 శాతం జరిమానా విధిస్తారు.

గడువు తేదీ ముగిసిన వెంటనే ఆదాయపన్ను శాఖ అధికారులు నల్లధనం దాచినవారిపై దాడులు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇటీవల కోలీవుడ్ హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతారల ఇళ్ళపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో చాలా భారీ మొత్తం స్వాధీనం చేసుకొన్నట్లు వార్తలు వచ్చేయి. రాజస్థాన్ రాష్ట్రంలో కిషన్ ఘడ్ అనే పట్టణంలో ఆర్.కె.మార్బిల్స్ సంస్థకు చెందిన ఒక కార్యాలయంపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో ఏకంగా రూ.13,000 కోట్లు నగదు పట్టుబడింది. ఒక గది నిండా నోట్లకట్టలు నీటుగా పేర్చి ఉండటం చూసి ఆదాయపన్ను శాఖ అధికారులు సైతం షాక్ అయ్యారు. వాటిలో భారత కరెన్సీ మాత్రమే కాకుండా అమెరికా డాలర్ల కట్టలు కూడా ఉన్నాయి. అధికారులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకొని ఆ సంస్థ యజమానులను, అధికారులను పోలీసులకి అప్పగించారు. ప్రభుత్వం సుమారు ఏడాది పాటు సమయం ఇస్తే కేవలం రూ. 3770 మాత్రమే వసూలు కాగా, ఆదాయపన్నుశాఖ అధికారులు జరిపిన ఒకే ఒక దాడిలో ఏకంగా రూ. 13, 000 కోట్లు పట్టుబడటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలు ఆరోగ్యం అత్యంత విష‌మం

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం.. ఈరోజు మ‌రింత క్షీణించింది. ఆయ‌న ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని స‌మాచారం. కాసేప‌ట్లో వైద్యులు హైల్త్ బుటిటెన్ ని విడుద‌ల చేయ‌నున్నారు....

బుగ్గనకు నెలాఖరు కష్టాలు.. ఢిల్లీలో నిధుల వేట..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రాష్ట్రానికి రావాల్సిన నిధుల జాబితా ఇచ్చి వెళ్లిన తర్వాతి రోజునే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో నిధులు...

“పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులు ఎత్తివేత” జీవో నిలుపుదల..!

తెలుగుదేశం పార్టీ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొంత మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ కేసులను ప్రస్తుత ప్రభుత్వం ఎత్తివేస్తూ...

కొడాలి నాని సంయమనం కోల్పోయి ఉండవచ్చు : సజ్జల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే.. పక్కాగా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది . అందులో డౌట్ లేదు. అందుకే కొడాలి నాని పనిగట్టుకుని అంటున్న మాటలు పై స్థాయి వారికి...

HOT NEWS

[X] Close
[X] Close