విశాఖలో నిర్ణయాత్మక మూడో వన్డేకు రంగం సిద్ధం అయింది. మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో మరోసారి రోహిత్, కోహ్లీ మెరుపులను విశాఖ క్రికెట్ ప్రియులు ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. కోహ్లీ వరుసగా రెండు వన్డేల్లో రెండు సెంచరీలు చేశారు. రెండు మ్యాచ్‌లలోనూ రన్ రేట్ దాదాపుగా ఏడు పరుగులుగా ఉంది. అయినా ఓ మ్యాచ్ లో ఓడారు..మరో మ్యాచ్‌లో గెలిచారు. ఇది చివరి వన్డే గెలిచిన వారికే ట్రోఫీ దక్కుతుంది. ఇప్పటికే టెస్టుల్లో టీమిండియా వైట్ వాష్ అయింది.
ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ కీలకం. మంచు ప్రభావం కీలకంగా మారనుంది. భారత్ గత 20 వన్డేలలో టాస్ గెలవలేదు. భారత కెప్టెన్లకు టాస్ ఎప్పుడూ కలసి రావడం లేదు. ముఖ్యంగా వన్డేలలో అసలు కలసి రావడం లేదు. ఏకంగా ఇరవై వన్డేల్లో టాస్ గెలవలేదంటే ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. 1986-87 తర్వాత టెస్ట్, వన్డే రెండు సిరీస్‌లు కూడా ఇండియాలో ఓడిపోయిన చరిత్ర లేదు. హోంటర్ఫ్ మీద ఏదో ఒకటి అయినా గెలుస్తూ వస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిపోతే చెత్త రికార్డు నమోదు చేసినట్లు అవుతుంది.
రెండో వన్డేలోని టీమ్‌ను మార్చకుండా ఉంచే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఫామ్‌లో ఉన్నాడు. ప్రసిద్ కృష్ణ ఎకానమీ హై అయినా రిప్లేస్మెంట్ లేదు. విరాట్ కోహ్లీకి విశాఖలో మంచి రికార్డు ఉంది. విశాఖలో నాలుగు సెంచరీలు చేశాడు. యావరేజ్ 97.83. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి హై స్కోర్ సెట్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని అంచనా. గత రెండు మ్యాచ్‌లలో బారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. మొత్తంగా విశాఖలో ఓ మంచి రొమాంఛికరమైన క్రికెట్ మాత్రం ఖాయమని అనుకోవచ్చు.