“నిపుణులు” ఇప్పటికీ అమాయకులుగానే కనిపిస్తున్నారా..!?

భారతదేశంలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు కానీ… అంత కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా బారిన పడుతున్న ప్రజలకు కనీసం ఆక్సిజన్ అందించలేని దౌర్భాగ్య పరస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే నిపుణుల కమిటీ హెచ్చరించింది. అయితే ఆ నిపుణుల్ని అమాయకుల కేటగిరి కింద జమ చేర్చేసిన కేంద్రం లైట్ తీసుకుంది. ఫలితంగా ఇండియా ఇప్పుడు కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ఇప్పుడు కూడా కేంద్రం మేలుకున్నట్లుగా కనిపించడం లేదు.

దేశ ప్రజల్ని కాపాడాలంటే.. ఒక్కటే మార్గమని.. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ అంటోనియో ఫౌచి దగ్గర్నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరకూ అందరూ సూచనలు.. సలహాలు ఇస్తున్నారు. కానీ కేంద్రం వారంతా అమాయకులన్నట్లుగా చూస్తూ… లాక్ డౌన్ లేదు ఏమీ లేదని స్పష్టం చేస్తోంది. కేంద్రంలో ఉన్న కరోనా విస్తృతి.. లక్షల మంది ప్రాణాలను తీయబోతోందని.. దీనిని వీలైనంత వరకూ తగ్గించడానికి మార్గం లాక్ డౌన్ మాత్రమేననని.. ఆంటోనియా ఫౌచీ చెబుతున్నారు. ఆయన మార్గంలోనే ఇతర విదేశీ నిపుణులు సలహాలిచ్చారు. ఎయిమ్స్ చీఫ్ గులేరియా కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా అదే సలహా ఇచ్చారు.

నిజానికి లాక్ డౌన్ విధించడం ప్రజలకు మాత్రమే… భారత్ వైద్య వ్యవస్థకు కూడా మంచిది . లేకపోతే… ఆ వ్యవస్థలో కీలక వ్యక్తులు.. కరోనాకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే.. కొన్ని తరాల పాటు.. భారత ప్రజలు నాణ్యమైన వైద్యం కోసం… అల్లాడిపోవాల్సి ఉంటుంది. అయితే మొదటి లాక్ డౌన్ సమయంలో వచ్చి పడిన ఆర్థిక నష్టం ముందు మరే నష్టమూ.. పెద్దది కాదని అనుకుంటోంది. ఎంత మంది ప్రాణాలైనా పోనీ.. వైరస్ ఎంతయినా విజృంభించనీ… ఆర్థిక వ్యవస్థ మాత్రం గాడిన ఉండాలని.. కేంద్రం కోరుకుంటోంది. అందుకే … లాక్ డౌన్ విధించాలన్న సలహాలిస్తున్న వారందర్నీ… లైట్ తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close