భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు గ్రౌండ్ లోనూ భారత్ సరైన బుద్ది చెప్పింది. ఆసియా కప్లో మూడు మ్యాచ్లు పాకిస్తాన్ తో ఆడి.. మూడింటిలోనూ ఏకపక్షంగా విజయం సాధిచంది. ఘోరంగా ఓడించడమే కాదు కనీసం వారికి గౌరవం ఇవ్వలేదు. గౌరవం ఇవ్వాల్సిందే అవసరం లేదని బయట ప్రపంచానికి చెప్పింది. షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. చివరికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు అధ్యక్షుడిగా ఉన్న పాక్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు. దీంతో పాక్ ఎంత తప్పు చేస్తోందో ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేశారు.
ఫైనల్లో టీమిండియా ఘన విజయం
ఆసియా కప్ ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తయిపోయింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ భారత్ ను సులువుగా విజయం వైపు తీసుకెళ్లాడు. టాపార్డర్ ను ఔట్ చేసి..సంబరాలు చేసుకుంది పాకిస్తాన్. కానీ టీమీండియాలో ఇప్పుడు చివరి వరకూ టాపార్డరేనని గుర్తించలేకపోయారు. గుర్తించే సరికి మ్యాచ్ అయిపోయింది. వర్మచ చితక్కొట్టి పాకిస్తాన్ పరువు తీశారు. కొన్ని ఆశలు పెట్టుకున్న పాక్ కంగుతిన్నది. ఇది పాకిస్తాన్ పై ఒకే టోర్నీలో మూడో విజయం. పాక్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.
పాక్ కు కనీస గౌరవం కూడా దక్కలేదు!
టోర్నీలో పాకిస్తాన్ కు ఎక్కడా కనీస గౌరవం దక్కలేదు. మొదటిసారి భారత్ షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదని .. టోర్నీని బహిష్కరిస్తామని బెదిరించింది. కానీ పోతే పొండి అన్నట్లుగా ఐసీసీ ఉండటంతో చివరికి దిగి వచ్చింది. మ్యాచ్ రిఫరీ ఆండి పై క్రాఫ్ట్ విచారం వ్యక్తం చేశారని చెప్పి మ్యాచ్కు లేటుగా ఆలస్యమయింది. ఒక వేళ టోర్నీని బహిష్కరించి ఉంటే..కాస్త అయినా పరువు కాపాడుకునేవారు కానీ.. వందల కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చేది. అంత డబ్బులు పాక్ బోర్డు వద్ద లేవు. అందుకే పరువు పోయినా మ్యాచ్లు ఆడారు. పాక్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడం ఆ దేశానికి చెప్పు దెబ్బలాంటిది.
నిరంతరం కుట్రలు చేసే వారికి అదే కరెక్ట్ !
పొరుగుదేశంగా ఉండి…భారత్ లో ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి టీమిండియా ఇచ్చిన ట్రీట్ మెంట్ కరెక్ట్ అన్నది ఏకాభిప్రాయం. ప్రపంచం అంతా మారుతున్నా అక్కడి పాలకులలో మాత్రం మార్పు రావడం లేదు. అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఏకాకిని చేస్తేనే.. బుద్ది వస్తోంది. వారు చేస్తున్న ఆకృత్యాలను ఇలాంటి చర్యల ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో టీమిండియా తనదైన ప్రయత్నం చేసింది.