అమెరికా రష్యా ఆయిల్ కంపెనీలపై తీవ్ర ఆంక్షలు విధించడంతో భారత్ రిఫైనరీలు కొనుగోలు నిలిపివేశాయి. నాలుగు ఆంక్షలు పడిన కంపెనీలపై భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు రష్యా యూరల్స్ క్రూడ్ మార్కెట్కు దూరంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి ఉన్నాయి. అమెరికా ఆంక్షలు విధించిన నాలుగు కంపెనీలు 2024లో భారత్ రష్యా చమురు దిగుమతుల్లో 80% కంటే ఎక్కువగా భారత్ కు ఆయిల్ అమ్మాయి.
అయితే ఇండియా ఇప్పుడు భఇన్నమైన వ్యూహం పాటిస్తోంది. చిన్న రష్యన్ సప్లయర్ల నుంచి డిస్కౌంట్ చమురు కొనుగోలు చేసే దిశగా ఆలోచిస్తున్నాయి. రోస్నెఫ్ట్ PJSC, లుకాయిల్ PJSC వంటి బ్లాక్లిస్ట్ చేసిన రష్యన్ పెద్ద కంపెనీలను పక్కన పెట్టి చిన్న కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని పరిశీలిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో నయారా ఎనర్జీ అనే భారత కంపెనీ మాత్రమే ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా కొనుగోళ్లు కొనసాగిస్తోంది.
భారత్ ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు. రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసుకునే చైనా కంపెనీలు కూడా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు తగ్గించాయి. భారత ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం నిర్ణయాలు తీసుకోనుంది. రష్యా లోని చిన్న కంపెనీల నుంచి అంటే అమెరికా ఆంక్షలు విధించని కంపెనీల నుంచి ఆయిల్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.