ఇండియా టుడే ప్రతి ఆరు నెలలకు ఓ సారి నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు .. దేశంలోని టాప్ సీఎంలలో టాప్ త్రీలో ఉన్నారు. మొదటి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ తమ స్థానాలను గత ఆరు నెలల కిందటితో పోలిస్తే మెరుగుపర్చుకున్నారు.
టాప్ త్రీ చంద్రబాబు
దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. చాలా కాలంగా అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. రెండో సారి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. చంద్రబాబు టాప్ ఫైవ్ లో ఉన్నారు. ఆరు నెలల కిందట మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు దేశవ్యాప్తంగా టాప్ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆరు నెలల్లో ఆయన తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి అభిప్రాయాలను సేకరించి వెల్లడించారు. తెలుగు ఓటర్లు కాని వారు కూడా ఓటు వేస్తారు. అయితే సాధారణంగా అందరికీ కాల్స్ వెళ్లినప్పుడు తెలుగు ఓటర్లు అభిప్రాయం చెబుతారు. అలాగే రాష్ట్రాల స్థాయిలో చంద్రబాబు 28 మంది ముఖ్యమంత్రుల్లో ఏడో స్థానంలో నిలిచారు.
కూటమికి లోక్ సభ సీట్లు పెరిగే చాన్స్
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీతో పాటు మిత్రపక్షాలు సీట్లను పెంచుకుంటాయని సర్వేలో వెల్లడి అయింది. టీడీపీ, జేడీయూ, శివసేన, వంటి పార్టీలు సీట్లను పెంచుకుంటాయి. అంటే.. ఆ పెరుగుదల కాస్త కాస్త ఎక్కువగానే ఉంది. 11 సీట్లను పెంచుకుంటాయని తెలిపింది. అంటే.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఆ నాలుగు ఎంపీ సీట్లలోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది.
పకడ్బందీగా పథకాల అమలు – అభివృద్ధి పనులు – లా అండ్ ఆర్డర్
ఏపీలో గత ప్రభుత్వ పాలనకు.. ఇప్పటి పాలనకు చాలా తేడా కనిపిస్తోంది. పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ ఉండటంతో పాటు సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి. ప్రజలకు సంతృప్తి కలుగుతోంది. అభివృద్ధి పనులూ ఆగడం లేదు. దీంతో చంద్రబాబుపై ప్రజా విశ్వాసం పెరుగుతోంది. మరో వైపు వైసీపీ ప్రతిపక్ష. హోదా లేదని.. ప్రతిపక్షంగా వ్యవహరించడం కన్నా.. ఫేక్ న్యూస్ చెప్పుకోవడమే రాజకీయం అనుకుంటోంది. ఇది కూడా టీడీపీకి అడ్వాంటేజ్ గా మారింది.
ఏడో స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. ఆయన దేశంలోని అత్యున్నత ముఖ్యమంత్రుల్లో ఏడో స్థానంలో నిలిచారు. ప్రజావసరాలను గుర్తించి… రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ప్రతిభ చూపిస్తున్నారు.