ఇంకొంత‌మంది సోనూసూద్‌లు కావ‌లెను!

ఈ దేశానికి ఇప్పుడు కోట్ల‌ వాక్సిన్లు కావాలి.
కొండంత ధైర్యం కావాలి.
ఇంకొంత‌మంది సోనూసూద్ లు కావాలి!

సోనూసూద్‌… ఎందుకో సోనూసూద్ తెగ న‌చ్చేస్తున్నాడు జ‌నాల‌కు. మంచిత‌నం సైతం మూర్చ‌బోయేలా.. తాను చేస్తున్న ప‌నుల్ని చూస్తుంటే – ఓ మ‌నిషి ఇంత చేయ‌గ‌ల‌డా? అనిపిస్తోంది. `ఆప‌ద‌` అంటే చాలు. త‌క్ష‌ణం వాలిపోతున్నాడు. సాయం అనే మాట వినిపిస్తే చాలు. తాను ప్ర‌త్య‌క్షమైపోతున్నాడు. అచ్చం సినిమాల్లో హీరోలు చేసిన‌ట్టు.

మీ విరాళాల‌న్నీ సోనూసూద్‌కి పంపండి. క‌చ్చితంగా న్యాయం జ‌రుగుతుంది. సాయం అందుతుంది.
సోనూ ఓ సామాన్యుడిగానే ఇంత చేస్తుంటే – తానే ప్ర‌ధాని అయితే…?

– సోనూపై సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్న కామెంట్లు ఇవి. నిజంగా ఇందులో ఏమాత్రం అతిశ‌యోక్తి ఏం లేదు. త‌న బ్యాంకు బాలెన్సుల్ని – ప్ర‌జా సంక్షేమం కోసం వాడేస్తున్న సోనూని చూస్తే.. ఎవ‌రికైనా అలానే అనిపిస్తుంది. నేత‌లు, ప్ర‌భుత్వాలు, వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు చేయాల్సిన సాయాన్ని తానొక్క‌డే చేసేస్తున్నాడు. ఇక మున్ముందు ఏమేం చేస్తాడో తెలీదుగానీ, ఈ దేశంలో ఓ రియ‌ల్ హీరో ఉద్భ‌వించాడ‌న్న సంకేతాల్ని మాత్రం ఇంకాస్త గ‌ట్టిగా పంప‌గ‌లుగుతున్నాడు సోనూ.

సోనూ స‌రే. మ‌రి మిగిలిన హీరోల మాటేంటి? వాళ్లంతా ఏం చేస్తున్న‌ట్టు.? ట్విట్ట‌ర్‌లో సందేశాల‌తో, వాట్స‌ప్ వీడియోల‌తో కాలక్షేపం చేయ‌డం త‌ప్ప‌. `చేతులు క‌డుక్కోండి. మూతులు క‌డుక్కోండి. ఇంట్లోనే ఉండండి` అంటూ చీటికి మాటికి చెవిలో పోరు పెట్ట‌డం `సాయం` కాదు. ఇప్పుడు ఈ దేశానికి మాట‌లు చెప్పేవాళ్లు కాదు. చేత‌ల‌తో తామేంటో చూపించేవాళ్లు కావాలి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ హీరో కూడా.. త‌నంత‌ట తాను ముందు కొచ్చి – కోవిడ్ బాధితుల్ని ఆదుకోవ‌డం ఎవ్వ‌రూ చూళ్లేదు. గుప్త‌దానాలు చేస్తున్నాం లెండి.. అనేవాళ్ల విష‌యంలో ఎలాంటి కామెంట్లూ చేయ‌లేం. చేతులెత్తి దండం పెట్ట‌డం త‌ప్ప‌.

ఒక్కో సినిమాకీ పాతిక‌, యాభై, వంద కోట్లు తీసుకుంటున్న హీరోల్లారా..? ఆ డ‌బ్బు జ‌నం నుంచే వ‌స్తుంద‌న్న విష‌యాన్ని మీరు గ్ర‌హించారా? అదే తెలిస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎందుకింత మౌనం..? ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు లేక ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల‌లో మీ అభిమానులూ ఉన్నారు. ఆసుప‌త్రిలో బెడ్లు లేక‌… రోడ్ల మీద ప‌డిగాపులు కాస్తున్న వాళ్ల‌లో.. మీ సినిమా టికెట్ల కోసం థియేట‌ర్ల ముందు క్యూ క‌ట్టిన‌వాళ్లూ ఉంటారు. వాళ్ల‌ని ఆదుకోవాల‌ని ఎప్పుడు అనిపిస్తుంది..? క‌నీసం సోనూలాంటి వాళ్ల‌ని చూసినప్పుడల్లా.. `మ‌న‌మూ ఏదైనా చేయాలి` అనే స్ఫూర్తి క‌ల‌గ‌డం లేదా?

ఆ హీరో రికార్డు ఈ సినిమాతో బ‌ద్ద‌లైపోయింది…

ఇండ్ర‌స్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ నాదే… అని కాల‌ర్లు ఎగ‌రేయ‌డం కాదు.

ద‌మ్ముంటే ఇప్పుడు సోనూసూద్ రికార్డుల్ని బ‌ద్దలు కొట్టండి. సోనూ చేసే సాయంలో క‌నీసం ప‌దో వంతు చేయ‌డానికైనా ప్ర‌య‌త్నించండి. రీలులోనే కాదు. రియ‌ల్ లైఫ్ లోనూ మీరు హీరోల‌న్న విష‌యాన్ని జ‌నం ఒప్పుకుంటారు. ఎప్ప‌టిలా… సోష‌ల్ మీడియాలో కాక‌మ్మ క‌బుర్లు చెబుతూ, కాల‌క్షేపం చేద్దాం అనుకుంటే మాత్రం… చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ జీరోలుగా మిగిలిపోతారు. ఛాయిస్ మీదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close