ధనాధన్ కోహ్లీ టీం..! ఆక్లాండ్‌లోనూ అదే స్టోరీ..!

ఇండియాలోనే పులి.. న్యూజిలాండ్ లాంటి చోట్లకు వెళ్తే.. పేపర్ టైగర్లేనంటూ… వచ్చిన విమర్శలను.. మొదటి టీ ట్వంటీలోనే … క్లీన్ బౌల్డ్ చేశారు.. ఆటగాళ్లు. 204 పరుగుల లక్ష్యాన్ని కూడా అవలీలగా చేధించి.. సత్తా చాటారు. ఆక్లాండ్‌లో జరిగిన మొదటి టీ ట్వంటీలో టీమిండియా ఆరు వికెట్లతేడాతో ఘన విజయం సాధించింది. చేజింగ్‌లో ఒక్క రోహిత్ శర్మ మినహా.. ప్రతి ఒక్కరూ.. బ్యాట్ ఝుళిపించారు. కష్టసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని… చాలా సులువుగా.. అధిగమించేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్.. దూకుడైన ఇన్నింగ్స్‌తో.. విజయానికి మొదటి పునాది వేశారు. 27 బంతుల్లోనే 56 పరుగులు చేశారు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో హోరెత్తించారు.

కేఎల్ రాహుల్‌కు కొత్తగా కీపింగ్ బాధ్యతలిచ్చినా… కివీస్ ఇన్నింగ్స్ మొత్తం కీపింగ్ చేసి.. వెంటనే బ్యాటింగ్‌కు దిగినా.. ఆ అలసట కనపడనివ్వలేదు. ఇక కెప్టెన్ కోహ్లీ 32 బంతుల్లో 45, శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో 58 చేశారు. శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికే హైలెట్. మ్యాచ్ టైట్‌గా మారుతోందని అనిపించిన ప్రతీ సారి భారీ షాట్లు కొట్టి.. ఆ పరిస్థితి లేదని పరిస్థితిని తేలిక పరిచారు. అంతకుముందుబ్యాటింగ్ చేసిన.. న్యూజిలాండ్‌కు.. భారత బౌలర్ల పెద్దగా ప్రతిఘటన ఇవ్వలేకపోయారు.

మున్రో, విలియమ్సన్, టేలర్ అర్థసెంచరీలు చేశారు. మహ్మద్ షమీ ఘోరమైన ప్రదర్శన చేశారు. నాలుగు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చేశారు కానీ.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఆక్లాండ్ పూర్తిగా బ్యాటింగ్ వికెట్ కావడంతో.. పరుగుల వరద పారింది.

న్యూజిలాండ్‌పై భారత్ టీట్వంటీ రికార్డు చెత్తగా ఉంది. గత ఏడాది 4-1తో వన్డే సిరీస్‌ను గెలుచుకన్న కోహ్లీసేన… టీ-20సిరీస్‌లో మాత్రం ఓడిపోయింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో గా టీ-20 ప్రపంచకప్‌ జరగనుండటంతో అలాంటి వాతావరణమే ఉండే న్యూజిలాండ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com