టారిఫ్ల పేరుతో బెదిరిస్తున్న ట్రంప్ విషయంలో భారత్ డోంట్ కేర్ పాలసీని పాలసీని పాటించాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. మా వస్తువులు కొనాలని తామేమీ ఒత్తిడి చేయడం లేదని.. బలవంతం చేయడం లేదని అవసరం లేకపోతే కొనడం మానేయాలని విదేశాంగ మంత్రి జై శంకర్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. బెదిరింపులకు తలొగ్గి దేశ ప్రజల ఆర్థిక ప్రయోజనాలు, చిన్న రైతుల, చిన్న వ్యాపారులను బలి పెట్టలేమని ఆయన స్పష్టం చేశారు.
భారత్ విషయంలో అమెరికా అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. రష్యాపై ఒత్తిడి పెంచడానికి భారత్ పై టారిఫ్లు పెంచామనే పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తోంది.ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనాలని ప్రపంచ దేశాలు భారత్ పై ఒత్తిడి తెచ్చాయి. ధరలు పెరుగుతూంటే.. స్థిరంగా ఉంచడానికి భారత్ ..రష్యా చమురుకొనేలా ప్రోత్సహించాయి. ఇందులో అమెరికా కూడా ఉంది. ఇప్పుడు అదే కారణంతో టారిఫ్లు వేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటిస్తున్నారు.
అమెరికా టారిఫ్ల ప్రభావం భారత్ పై ఉంటుందేమో కానీ ఎలాగోలా ఆ మార్కెట్ ను ఇతర దేశాల నుంచి కవర్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రష్యా, చైనాలతో వాణిజ్యం పెంచుకుంటోంది. ఈ పరిణామంతో సుదీర్ఘ మిత్రదేశంగా ఉన్న భారత్ ..అమెరికాకు దూరం అవుతోంది. అమెరికా పాకిస్తాన్ ను దగ్గర చేసుకుంటోంది. పాకిస్తాన్ చైనా అదుపాజ్ఞల్లో ఉంటుంది. ఎలా చూసినా..భారత్ విధానం చాలా స్పష్టంగా ఉందని.. అమెరికాకు తొలగ్గాల్సిన అవసరం లేదని ప్రజాభిప్రాయం. అసలు టారిఫ్లు పడేది.. అమెరికా ప్రజలపైనే. ఆ సెగ తగిలినప్పుడు ట్రంపే దిగివస్తారని రాకపోయినా పర్వాలేదని భారత వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి.