ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 19 నుంచి ఆసీస్, భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ రెండు సిరీస్ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది.
వన్డే జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
టీ20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.
భారత్ వన్డే జట్టులో అందరూ ఊహించినట్లుగానే ఓ సంచలన మార్పు జరిగింది. టీమ్ఇండియా కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి శుభ్మన్ గిల్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. విరాట్ కోహ్లీని కూడా ఎంపిక చేశారు.
రోహిత్, విరాట్ ఇండియన్ సూపర్ స్టార్స్. ఇప్పటికే టీ20, టెస్ట్ కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. మరో వరల్డ్ కప్ ఆడాలనేది వారి అభిమతం. కానీ ఇప్పుడు చోటు చేసుకున్న పరిస్థితులు చూస్తుంటే వారికి ఆ ఛాన్స్ దొరకడం కష్టమే.
గంబీర్ యూత్ కి ప్రాధాన్యత ఇస్తున్నాడు. గత ఆరు నెలలు ఈ ఇద్దరూ జట్టుకి దూరంగా వున్నారు. ఆస్ట్రేలియా టూర్ విరాట్ రోహిత్ కి చివరి సిరిస్ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు స్టార్స్ గా అలరించిన విరాట్, రోహిత్ కెరీర్ చరమాంకంలో పడిపోయారనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి.