ఇంద్రాణి ప్రియులు నలుగురు

ఇంద్రాణి కేసు (షీనా మర్డర్ కేసు)లో పోలీసులు ఒకపక్క తవ్వకాలుజరుపుతూ వాస్తవాలు వెలికితీస్తుంటే మరో పక్కన ప్రధాననిందితురాలైన ఇంద్రాణి ప్రేమవ్యవహారాలు ఒకటొకటిగా వెలుగుచూస్తున్నాయి.

ఇంద్రాణి ప్రియులు..

1. చౌధురి: ఇతను గువహాటి న్యాయవాది. ఇంద్రాణి టీనేజ్ లో ఉన్నప్పుడు ఇతగాడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ గువహాటి కాటన్ కాలేజీలో కలిసిచదువుకున్నారు. అప్పుడే వీరినడుమ ప్రేమ అంకురించింది. ఈ విషయం చౌధురి స్వయంగా మీడియాకు చెప్పారు. ఇంద్రాణి టీనేజ్ నుంచి చాలా అందంగా ఉండేదట. పైగా తెలివితేటలున్న పడుచుపిల్ల. ఇలాంటి అమ్మాయితో ప్రేమలో పడాలని యువకులు వెర్రెత్తిపోయారు. అయితే ఈ తెలివైన పిల్ల చివరకు చౌధురి అనే అబ్బాయిని ప్రేమలో పడేసింది. `నీకేం కావాలో చెప్పు…’ అనడం తరువాయి, వెంటనే కోరిక చిట్టావిప్పేసేదని ఈ ప్రేమికుడు చెప్పాడు. కాలేజీ చదువయ్యాక ఇంద్రాణి టపాకట్టేసి షిల్లాంగ్ కు జంప్ చేసింది. అక్కడ ఒక ప్రొఫెషర్ తో ప్రేమబంధనం కట్టేసింది.

2. సిద్ధార్థ్ దాస్ : ఇంద్రాణి అలా షిల్లాంగ్ లో ఉండగానే ఒక ప్రొఫెసర్ తో ప్రేమలో పడిందని చెప్పుకున్నాంకదా. బహుశా ఆ ప్రొఫెసర్ ఇతగాడు ఒకరైఉండవచ్చు. నిజం నిదానంగా తెలుస్తుందిలేండి. అయితే, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, సిద్దార్థ్ దాస్ తల్లి మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడు షిల్లాంగ్ లో ఉండగా ఇంద్రాణితో ప్రేమలో పడ్డాడనీ, తర్వాత వీరిద్దరూ వివాహంకూడా చేరసుకున్నారని సిద్ధార్థ్ దాస్ తల్లి సౌత్ అసోంలోని సిల్ఛార్ లో విలేఖరులకు వెల్లడించారు. హత్యకు గురైన షీనా బోరా మరెవరిబిడ్డోకాదనీ, వీరిద్దరికి పుట్టినదేనని కూడా ఆమె తేల్చిచెప్పారు. షీనానేకాదు, షీనాకు సోదరుడున్నాడని ఈ కేసు విచారణలో బయటపడిందికదా, అతనే మిఖాయిల్ బోరా. ఈ కుర్రాడుకూడా వీరిద్దరి (ఇంద్రాణి- సిద్ధార్థ్ దాస్) సంతానమేనట. ఆతర్వాత కొన్నాళ్లకు ఇంద్రాణి షిల్లాంగ్ వదిలేసి కోల్ కతా చేరింది.

3. సంజీవ్ ఖన్నా: షిల్లాంగ్ లో సీన్ కట్ చేస్తే కోల్ కతలో ప్రేమ కథమళ్ళీ మొదలైంది. ఇతను కోల్ కతాలో మాంచి బిజినెస్ మ్యాన్. కోట్లకు పడగలెత్తాడు. ఎవరుఏది కోరినా ఆ కోరికను చిటికలో తీర్చగలడు. అలాంటి దమ్మున్న వ్యక్తిని ఇంద్రాణి ఆరాధించింది. అది చిటికలో ప్రేమగా మార్చేసుకుంది. తర్వాత వీరిద్దరికి పెళ్లయింది. సంజీవ్ ఖన్నా రియలెస్టేట్ లోకి దిగి ఆర్థికంగా బాగాఎత్తుకు ఎదిగాడు. కొన్నాళ్లు కాపురంచేశాక ఇంద్రాణి మాజీభర్త అయ్యాడు. ఇప్పుడు కేసులో ఇరుక్కోవడంలో ఇంద్రాణి తనను మోసంచేసిందని తలపట్టుకువాపోతున్నాడు.

4. పీటర్ ముఖర్జియా : ఇతను మీడియాలో ఉన్నతపదవులు అలంకరించిన వ్యక్తి. 1997 నుంచి 2007వరకు స్టార్ ఇండియా టివీఛానెల్ కు సీఈఓగా వ్యవహరించారు. ఐఎన్ఎక్స్ మీడియాకు చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ గా చేరారు. 2009లో ఆ కంపెనీని వదిలేశారు. అప్పటినుంచి విశ్రాంతజీవనం గడుపుతున్నారు. ఇంద్రాణితో ప్రేమలో పడ్డారు. అప్పటికే ఆయనకు పెళ్లయింది. ఇంద్రాణితో రెండవ పెళ్ళిచేసుకున్నారు. పీటర్ ముఖర్జియా మొదటిభార్యకు పుట్టినవాడు రాహుల్. ఈ కుర్రాడు షీనాతో ప్రేమలో పడటంతో ఇంద్రాణికి నచ్చలేదనీ, దీంతో షీనాను అంతమొందించడానికి కుట్రపన్నిందన్న అభియోగంఉంది.

మగవాళ్లూ జాగ్రత్త

ఇంద్రాణి ప్రేమవ్యవహారాలు నిశితంగా గమనిస్తున్న సైకాలజిస్ట్ లు ఆమె మగపురుగులను ఆకర్షించే కాంతిపుంజంలాంటిదని అంటున్నారు. తన కోరికలు (అవి శారీరకమైనవైనా కావచ్చు, లేదా ఆర్థికమైనవైనా కావచ్చు కాకుంటే స్టాటస్ సింబల్ కు సంబంధించినవి కావచ్చు) తీర్చుకోవడానికి ఎంతకైన తెగించే తత్వం ఉన్నవాళ్లు ప్రేమపేరిట మగవాళ్లను ఆకర్షించి వారిని చివరకు దహింపజేస్తారని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. కన్నకూతుర్ని చంపుకునే తల్లులుంటారు జాగ్రత్త అని, ప్రేమలో పడేసి శలభాలుగా మారుస్తారు జాగ్రత్తని ఈకేసు ఒక పాఠం చెబుతోంది. ఇంద్రాణివంటివాళ్లు ఈసమాజంలో చాలామందేఉంటారు. వీళ్లమనసులోని కోరిక తీరేవరకూ తమమాటల గారడీ, చేష్టల వ్యామోహాలతో ఇట్టే కట్టిపడేస్తారు. ఈమాయ నుంచి తేరుకునేలోపే మనమెక్కడో ఊబిలో కూరుకుపోయిఉంటాము. అందుకే ఇలాంటి వారితో మగవాళ్లు జాగ్రత్తగానే ఉండాలని సైకాలజిస్ట్ లుచెబుతున్నారు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com