ఇన్‌సైడ్ టాక్‌: ‘సైరా’ రీషూట్ల మ‌యం…విడుద‌ల వ‌చ్చే సంక్రాంతికే

2019 వేస‌వి ల‌క్ష్యంగా ‘సైరా’ మొద‌లైంది. అయితే.. అది ఇప్ప‌ట్లో వ‌చ్చేట్టు కనిపించ‌డం లేదు. ఏకంగా 2020 సంక్రాంతికి వెళ్లిపోయే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. షూటింగ్ ఆల‌స్య‌మ‌వ్వ‌డం, దానికి తోడు తీసిన సీన్‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ తీస్తుండ‌డంతో ‘సైరా’ విడుద‌ల‌లో భారీ జాప్యం జ‌రుగుతున్న‌ట్టు ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. ముందు నుంచీ.. ‘సైరా’కు స‌మ‌స్య‌లే. యాక్ష‌న్ ఎపిసోడ్‌తో ఈ సినిమా మొద‌లైంది. అది స‌వ్యంగా లేద‌ని భావించిన చిరు.. ఆ సీన్ మొత్తాన్ని రీషూట్ చేయించాడు. ఇప్పుడు సీన్లు కూడా అలానే త‌యార‌య్యాయ‌ని, కొన్ని సీన్లు చిరుకి ఏమాత్రం న‌చ్చ‌లేద‌ని, వాటిని మ‌ళ్లీ తిర‌గ‌రాయించి, రీషూట్ చేయించాల‌ని ఆదేశించాడ‌ని తెలుస్తోంది.

2019 వేస‌వికి `సైరా`ని విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. కానీ అది ఎట్టిప‌రిస్థితుల్లోనూ సాధ్యం కాద‌ని తేలిపోవ‌డంతో… ఆగ‌స్టు 15న విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ ఆ డేట్‌న `సాహో` ముందే క‌ర్చీఫ్ వేసింది. దానికి తోడు రీషూట్లు ఎక్కువ అవుతుండ‌డంతో..`సైరా`ని సంక్రాంతికి తీసుకురావ‌డ‌మే ఉత్త‌మం అని చిరు ఫిక్సయిన‌ట్టు తెలుస్తోంది. ద‌స‌రా బ‌రిలో దిగొచ్చు గానీ.. చిరు గురి సంక్రాంతిపై ప‌డింద‌ని టాక్‌. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ప‌నితీరుపై చిరు అసంతృప్తితో ఉన్నాడ‌ని, కొన్ని స‌న్నివేశాల్ని చిరునే.. డైరెక్ట‌ర్ కుర్చీలో కూర్చుడి తీసేశాడ‌ని ఇది వ‌ర‌కే వార్త‌లొచ్చాయి. అయితే సురేంద‌ర్‌రెడ్డికి రామ్‌చ‌ర‌ణ్ అండ‌దండ‌లుండ‌డంతో… చిరు కూడా ఏమీ అన‌లేక‌పోతున్నాడ‌ట‌. `బాహుబ‌లి` రికార్డుల‌పై క‌న్నేసిన సినిమా అది. అందుకే చిరు.. ఏ విష‌యంలోనూ నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం స‌హించ‌డం లేద‌ని, సినిమా రావ‌డం ఆల‌స్య‌మైనా… క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డ‌కూడ‌ద‌ని చిత్ర‌బృందానికి గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. అందుకే.. `సైరా` ఇలా న‌త్త‌న‌డ‌క న‌డుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

పుస్త‌క రూపంలో ‘పూరీఇజం’

పూరి సినిమాల్లో డైలాగులు ఎంత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సూటిగా, గుండెని తాకేలా రాయ‌గ‌ల‌డు. అవ‌న్నీ సినిమాల‌కే ప‌రిమితం కాదు. త‌న జీవ‌న శైలే అలా ఉంటుంది....

పోలీస్ స్టేష‌న్‌లో న‌గ్నంగా `రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌`

టాలీవుడ్ లో ఇప్పుడు రెండు ర‌కాల సినిమాలే త‌యార‌వుతున్నాయి. ఓటీటీలో అవే విడుద‌ల అవుతున్నాయి. ఒక‌టి రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న సినిమాలు, రెండోది రాంగోపాల్ వ‌ర్మ‌పై తీస్తున్న సినిమాలు. బ‌యోపిక్‌ల పేరుతో.. వాస్త‌వ...

HOT NEWS

[X] Close
[X] Close