‘ఇన్ స్పెక్టర్ రిషి’ (వెబ్ సిరిస్) రివ్యూ : భయపెట్టే అడవి

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో బోలెడన్నీ సినిమాలు, వెబ్ సిరిస్ లు వచ్చాయి. ఈ తరహ కథలతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయాలంటే ఏదో కొత్తదనం చూపించాలి. క‌థ ఎత్తుగ‌డ‌ లోనే ఆ కొత్తదనం సెట్ చేసుకోవాలి. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘ఇన్ స్పెక్టర్ రిషి’ వెబ్ సిరిస్ లో ఈ ప్రయత్నం జరిగింది. నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరిస్ ఇది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కు మిస్టరీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్ తో పాటు హారర్ టచ్ ఇస్తూ సాగిన వెబ్ సిరిస్ ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని పంచింది? సైన్స్, మూఢనమ్మకాల కాన్ ఫ్లిక్ట్ ప్రేక్షకులని ఎంగేజ్ చేసిందా?

తమిళనాడులోని తేన్ కాడ్ అడవి. ఓ రోజు రాత్రి రాబర్ట్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అడవిలో ఒంటరిగా నడుస్తుండగా ఏదో వింత ఆకారం కనిపిస్తుంది. మరుసటి ఉదయం రాబర్ట్ డెడ్ బాడీ ఓ చెట్టుకి వేలాడుతూ వుంటుంది. డెడ్ బాడీకి సాలీడు గూడు కట్టేసి ఉంటుంది. రాబర్ట్ చావుకి కారణం వనరాచి (అడవి దేవత)అని స్థానికుల నమ్మకం. ఈ కేసుని పరిష్కరించే బాధ్య‌త‌ సీబీసీఐడీ ఆఫీసర్ రిషి (నవీన్ చంద్ర)కి అప్పగిస్తారు అధికారులు. రిషికి డిపార్ట్మెంట్ లో మంచి పేరు వుంటుంది. విధి నిర్వహణలో ఓ ఘటన కారణంగా ఓ కన్నుని కోల్పోతాడు రిషి. అయినప్పటికీ రిషి పనితీరుపై నమ్మకంతో ఈ కేసుని అప్పగిస్తారు. రిషి సైన్స్ ని నమ్మే మనిషి. ప్రపంచంలో జరిగే అంతుచిక్కని సంఘటనల వెనుక సైన్స్ దాగుందని, అన్నీ కూడా ఒక లాజిక్ ఆధారంగానే జరుగుతాయనేది తన నమ్మకం. రిషి ఈ కేసులోకి వచ్చిన తర్వాత రాబర్ట్ చనిపోయిన తీరులోనే మరికొన్ని చావులు చోటు చేసుకుంటాయి. ఈ చావుల వెనుక వున్న మర్మాన్ని రిషి ఎలా చేధించాడు? ఈ కథలో సత్య (శ్రీకృష్ణ దయాళ్), అయ్యనార్‌ (కన్నా రవి), చిత్ర (మాలినీ జీవరత్నం), క్యాథరిన్ (సునైనా), ఇర్ఫాన్‌ (కుమారవేల్), విజి (హరిణి సుందరరాజన్) ఎలాంటి పాత్రలు పోషించారు? అడవి చుట్టూ జరుగుతున్నసాలేగూడు హత్యలు వెనుక నిజంగానే అతీంద్రీయ శక్తులు ఉన్నాయా? ఇదంతా మిగతా కథ.

వెబ్ సిరిస్ లో ప్రేక్షకులని ముందుగా కూర్చోబెట్టేది జోనర్, దానికి తగిన యాంబియాన్స్. ఈ విషయంలో దర్శకురాలు నందిని మంచి పనితీరు కనబరిచింది. తేన్ కాడ్ అడవి, అక్కడి మనుషులు, వాళ్ళు తీసుకున్న అంతుచిక్కని ఓ నిర్ణయం.. సిరిస్ తొలి ఎపిసోడ్ లో చూపించిన ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఉన్న‌పాటుగా ఆ ప్ర‌పంచంలోకి తీసుకెళ్ళిపోతాయి. అసలు ఏం జరిగింది ? ఎందుకు జరిగింది? ఏం జరుగుతోంది? ఇలాంటి ఆసక్తిని సిరిస్ ఆద్యంతం కలిగించేలా కథనం నడిపారు. రిషి కేసులోకి వచ్చిన తర్వాత జరిగే ఒకొక్క మిస్టరీ డెత్, దాని వెనుక వున్న కారణాలు అన్వేషించడం సస్పెన్స్ ని క్రియేట్ చేయగలిగాయి. ముఖ్యంగా ఎపిసోడ్ చివర్లో వచ్చే క్లిప్ హ్యాంగర్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అప్పటివరకూ నిదానంగా ఉన్నప్పటికీ ఎపిసోడ్ చివరి పది నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠని రేపాయి. అడవి, వానరచి నేపధ్యంలో వచ్చే ఎపిసోడ్స్ హారర్ ని ఇష్టపడే ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.

ప్ర‌తి వెబ్ సిరిస్ లోనూ ప్రతి పాత్రకు దాదాపుగా ఒక బ్యాక్ స్టొరీ వుంటుంది. ఇందులో కూడా వున్నాయి. రిషితో పాటు సత్య (శ్రీకృష్ణ దయాళ్), అయ్యనార్‌ (కన్నా రవి), చిత్ర (మాలినీ జీవరత్నం), క్యాథరిన్( సునైనా ) విజి (హరిణి సుందరరాజన్) ఈ పాత్రలకు సెపరేట్ ట్రాక్స్ కనిపిస్తాయి. దీన్ని క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ కోణంలో చూస్తే మాత్రం ఇందులో చిత్ర, విజి, అయ్యనార్ పాత్రలకు సంబధించిన ట్రాక్స్ అనవసరం అనిపించే అవకాశం వుంది. అయితే దర్శకురాలు నందిని ఆ పాత్రలని ఒక సబ్ టెక్స్ట్ గా తీసుకొని అడవికి బయటప్రపంచంలోని మానవ సంబంధాలు, ప్రేమ, ద్వేషం, ఆశలకి మధ్య అంతర్లీనంగా ఒక దృక్కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. దాన్ని లోతుగా అర్ధం చేసుకుంటే అందులోని సారాన్ని పట్టుకోవచ్చు.

నవీన్ చంద్ర నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకి ఏ పాత్రని ఇచ్చినా పండిస్తాడు. రిషి పాత్రని కూడా చాలా నేర్పుతో చేశాడు. సిరిస్ మొత్తంలో తన మొహంపై ఒక్క నవ్వు కూడా వుండదు. అంతటి సీరియస్ పాత్రని ఎక్కడా బోర్ కొట్టించకుండా చేశాడు. ఫారెస్ట్ అధికారి సత్యగా చేసిన శ్రీకృష్ణ దయాళ్ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. సునైనా చాలా సహజంగా కనిపించింది. కథలో ఆమె పాత్ర కీలకం. అయ్యనార్‌, మాలినీ జీవరత్నం, హరిణి సుందరరాజన్, మైమ్ గోపీ దాదాపు కనిపించిన ప్రతి పాత్ర నటనలో వంకపెట్టలేనంత సహజంగా కుదిరారు. దర్శకురాలు నందిని అడవి కూడా ఒక పాత్రగా వాడుకున్న తీరు బావుంది. నేపధ్య సంగీతం కొన్ని చోట్ల వణుకుపుట్టిస్తుంది. కెమెరాపనితనం బావుంది. దాదాపు అడవిలోనే తీయడం వలన కథకు కావాల్సిన సహజత్వం వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.

మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్న‌ సిరిస్ ఇది. ప్రతి ఎపిసోడ్ నిడివి 40 నిమిషాలకు పైనే వుంటుంది. అయితే ఒక సినిమాలా వేగం, మలుపులు ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. నిదానంగా సాగే సిరిస్ ఇది. పాత్రలు, వాటి కాన్ ఫ్లిక్ట్, ఎమోషన్స్ చాలా నింపాదిగా వెళ్తుంటాయి. ఏకబిగిన చూసేసే సిరిస్ అయితే కాదు. కాస్త సమయం తీసుకొని ‘అసలు ఈ అడవి సంగతి ఏమిటో చూద్దామనే’ అనే ఆలోచనతో చూస్తే మాత్రం ఒక డీసెంట్ వెబ్ సిరిస్ చూసిన అనుభూతినైతే ఇస్తుంది. దానికి తోడు టైటిల్ ఏదో అర‌వ డ‌బ్బింగ్ సినిమాకు పెట్టిన తెలుగు టైటిల్ లా ఉంది. రెగ్యుల‌ర్ ఫీలింగ్ క‌లిగిస్తుంది. టైటిల్ విష‌యంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తే బాగుండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close