ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌: శ‌నివారం మాత్ర‌మే శివాలెత్తే హీరో క‌థ‌

మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రుదా, అంటే సుంద‌రానికి… ఇలా సెన్సిటీవ్ స‌బ్జెక్ట్స్ తో ఆక‌ట్టుకొన్నాడు వివేక్ ఆత్రేయ‌. ఇప్పుడు రూటు మార్చి కాస్త యాక్ష‌న్‌, కాస్త ఫాంట‌సీ మిక్స్ చేసిన ఓ వెరైటీ క‌థ‌ని ఎంచుకొన్నాడు. అదే.. `స‌రిపోదా శ‌నివారం`. నాని క‌థానాయ‌కుడిగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రానికి ఈ పేరు ఖ‌రారు చేశారు. డివివి దాన‌య్య‌, దాస‌రి కిర‌ణ్ నిర్మాత‌లు. ద‌స‌రా సంద‌ర్భంగా టైటిల్ ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ గ్లింప్స్ కూడా విడుద‌ల చేశారు. సాయి కుమార్ వాయిస్ ఓవ‌ర్‌లో.. ఈ క‌థ‌ని టూకీగా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌తీ ఒక్క‌రికీ ఓ రోజు వ‌స్తుంద‌ని, ప్ర‌తీ శ‌నివారం త‌న‌దైన రోజుగా చేసుకొని శివాలెత్తే హీరో క‌థ‌ని ఈ సినిమాలో చూపించ‌బోతున్నామ‌ని హింట్ ఇచ్చేశాడు ద‌ర్శ‌కుడు. కాన్సెప్ట్ ఆస‌క్తిక‌రంగా ఉంది. నానిని కొత్తగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న విష‌యం గ్లింప్స్ తోనే అర్థ‌మైపోయింది. ఈసారి నాని యాక్ష‌న్ బాట ప‌ట్టాడు. శ‌నివారం మాత్ర‌మే శ‌క్తిమంతుడిగా క‌నిపించి, మిగిలిన రోజుల్లో సాదా సీదాగా ప్ర‌వ‌ర్తించే ఓ హీరో క‌థ ఇది. ఫ‌న్‌, యాక్ష‌న్ రావ‌డానికి కావ‌ల్సినంత స‌రుకు ఈ క‌థ‌లో ఉంది. ఈ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎస్‌.జే.సూర్య ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close