`నెట్’కుంటూ పోతున్న జనం

జనమేజయ మహారాజు మహాబారతకథని చాలా శ్రద్ధగా వింటున్నాడు. వైశంపాయునుడు అంతే శ్రద్ధగా చెబుతున్నారు. వీరిలో ఒకరు శ్రోత అయితే, మరొకరు వక్త. జనమేజయుడు తనకు కలిగిన సందేహాలను వైశంపాయనుడి ముందు ఉంచుతున్నారు. వాటిని అరటిపండు ఒలిచినట్లు వివరిస్తూ సందేహాలు తీరుస్తున్నాడు వైశంపాయునుడు. అది ద్వాపర- కలియుగ సంధికాలం. ఈ భూమండలంలో జరిగే అనేకానేక విషయాలను జ్ఞానులైన మునులు వివరించేవారు. అలా విషయజ్ఞానం వేదకాలం నుంచి అందుతుండేది.

తాళపత్రాలమీద తాను సేకరించిన వైద్య పరిజ్ఞానాన్ని చరకుడు శ్రద్ధగా నిక్షిప్తం చేస్తున్నాడు. కొన్నాళ్లకి `చరకసంహితము’ పేరిట తాళపత్ర గ్రంథం తయారైంది. ముందుతరాలవారికి అందుబాటులో ఉంచేందుకు దాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. అది క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది.

ముద్రణాయంత్రాలు వచ్చాయి. పుస్తకాలు అచ్చవడం మొదలైంది. తాళపత్ర గ్రంథాలు కనుమరుగయ్యాయి. పుస్తకాలు కోకొల్లలుగా అచ్చవుతున్నాయి. ముఖ్యమైన పుస్తకాలను ఒకచోట చేర్చి గ్రంథాలయాలను స్థాపించారు. విషయజ్ఞాన సేకరణకోసం ప్రజలు గ్రంథాలయాలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఇది 18వ శతాబ్ది.

ఇప్పుడు నడుస్తున్నది ఇంటర్నెట్ యుగం. ఒక విషయంమీద సమాచారం తెలుసుకోవాలన్నా, సందేహాలు తీర్చుకోవాలన్నా ఇప్పుడు మనలో చాలామంది మొదటచేసే పని- నెట్ కి వెళ్ళి సెర్చి ఇంజన్ లోకి దూరేయడం. సమాచారాన్ని పంపాలన్నా, అందిపుచ్చుకోవాలన్నా క్షణాల్లో జరిగిపోతోంది. ఒకటిరెండు దశాబ్దాల క్రిందట మనదేశంలో చాలామందికి ఇంటర్నెట్ పదం తెలియదు. కంప్యూటర్ అంటే భయం. కీ బోర్డ్ ముట్టుకోవాలంటే అదురు. ఏది నొక్కితే ఏమి జరిగిపోతుందోనన్న బెదురు. కేవలం కొంతమందికి మాత్రమే కంప్యూటర్ లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఇంటర్నెట్ వాడకంలో సంఖ్యాపరంగా చూస్తే అమెరికానే దాటబోతున్నది. ఇది మనందరికీ గుడ్ న్యూస్.

తెల్లవారిన దగ్గరనుంచి, రాత్రి నిద్రలోకి జారుకునేదాకా ఇంటర్నెట్ ఓ స్నేహితునిగా వెంటే ఉంటున్నది. సోషల్ మీడియా నెట్ రంగంలోకి దిగగానే సమాచార వ్యవస్థ హద్దులు చెరిగిపోయాయి. ఏ చిన్న అవసరం వచ్చినా ఫేస్ బుక్, వాట్సప్ వంటి సాధనాలను ఉపయోగించుకుంటున్నారు. అలా జీవితంలో `నెట్’కుంటూ పోతున్నారు.

జనాభాలో అగ్రస్థానంలో ఉండటంతో చైనా సహజంగానే ఇంటర్నెట్ వాడకంలోనూ అగ్రస్థానంలోనే ఉంది. అక్కడ 60కోట్ల మంది నెట్ వాడుకుంటున్నారు. కాగా, మనదేశంలో వచ్చే నెలనాటికి వీరి సంఖ్య 40కోట్ల 20 లక్షలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా.

ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య కోటి నుంచి పదికోట్లకు పెరగడానికి పదేళ్లు పట్టింది. అదే, పదికోట్లనుంచి 20కోట్లకు పెరగడానికి మూడేళ్లే పట్టింది. కాగా, 30 కోట్ల యూజర్స్ కేవలం ఏడాదిలో 40కోట్లకు పెరిగారు.

మొబైల్, నెట్ ఆధారిత సేవలు, సామాజిక వెబ్ సైట్లు, సమాచార అప్లికేషన్స్, నెట్ బ్యాంకింగ్, ఆన్ లైన్ షాపింగ్ వంటివి ఇక మరింత పుంజుకుంటాయి. ఇప్పటికే లక్షలకోట్ల బిజినెస్ ని సొంతం చేసుకున్న ఇ-కామర్స్ రంగం మరింత స్పీడ్ గా దూసుకుపోవడం ఖాయం.

ఒకప్పుడు మొబైల్ ఫోన్ వస్తుందన్న ఊహేలేదు. అదో ఆశ్చర్యకరమైన వస్తువుగా చాలాకాలం ఉండిపోయింది. వైర్ లెస్ ఫోన్లు రాకముందు కదులుతూ స్టైల్ గా ఫోన్లో మాట్లాడాలని మనిషి తెగ ఆరాటపడ్డాడు. బాగా సంపన్నుల ఇళ్లలో ల్యాండ్ లైన్ సెట్ కి చాంతాడంత వైర్ బిగించి , ఆ వైర్ కట్టని, ఫోన్ సెట్ ని వెండిపళ్లెలో ఉంచుకుని ఇంట్లో పనివాడు పట్టుకుని నడుస్తుంటే, ఇంటి యజమాని హుందాగా రిసీవర్ అందుకుని ఫోన్ లో మాట్లాడుతూ మెట్లుదిగుతుంటాడు. పాత సినిమాల్లో ఇలాంటి దృశ్యాలుండేవి. అంత వైర్ కట్ట, ఫోన్ సెట్ ని పట్టుకునే వ్యక్తి ఉండాలంటే అందరికీ సాధ్యంకాదని అనుకునేవారు. కానీ, కొన్ని దశాబ్దాలు గడిచేసరికి ఆ కల నిజమైంది. వైర్ లెస్ ఫోన్ సెట్లు వచ్చాయి. తర్వాత మొబైల్ ఫోన్లు చేతిలో ఇమిడిపోయాయి. ఇప్పుడు అవి కేవలం ఫోన్ గానే కాకుండా మల్టీపర్పస్ డివైజ్ గా మారిపోయింది. నెట్ ఫెసిలిటీ వచ్చేసింది. దీంతో ఇక దాన్ని వదిలించుకునే పరిస్థితే లేదు. ఇప్పుడు టివీ కూడా మల్టీపర్పస్ గా మారిపోయింది. టివీలో నెట్ కనెక్షన్ రావడంతో స్మార్ట్ టివీలుగా మారిపోయాయి. టివీలు తనకుతానే హద్దులను చెరిపేసుకుంది.

సమాజంలోమంచి చెడులున్నట్టుగానే నెట్ వాడకంలో మంచిచెడ్డలున్నాయి. నెట్ వాడకాన్ని సమాజపురోభివృద్ధికి, వినోదానికి వాడుకుంటే ఫర్వాలేదు. అలాకాకుండా విధ్వంస చర్యలకు ఉపయోగించుకోవడం బాధకలిగించే విషయం.

నెటిజెన్లు తలచుకుంటే సామాజిక విప్లవాలు సృష్టించగలరు. ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలరు, అలాగే కూల్చనూగలరు. ఇంతటి శక్తి ఉన్నదికనుకనే 125కోట్లకు పైగా ఉన్న భారతదేశంలో ఇది బాగా పాతుకుపోతోంది. ఇప్పటికి 40శాతం దగ్గరున్న యూజర్స్ సంఖ్య వచ్చే ఏడాదికి 50కోట్లకు చేరవచ్చు. కేవలం రెండుమూడేళ్లలోనే యూజర్స్ సంఖ్య 80కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలు ఆరోగ్యం అత్యంత విష‌మం

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం.. ఈరోజు మ‌రింత క్షీణించింది. ఆయ‌న ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని స‌మాచారం. కాసేప‌ట్లో వైద్యులు హైల్త్ బుటిటెన్ ని విడుద‌ల చేయ‌నున్నారు....

బుగ్గనకు నెలాఖరు కష్టాలు.. ఢిల్లీలో నిధుల వేట..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రాష్ట్రానికి రావాల్సిన నిధుల జాబితా ఇచ్చి వెళ్లిన తర్వాతి రోజునే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో నిధులు...

“పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులు ఎత్తివేత” జీవో నిలుపుదల..!

తెలుగుదేశం పార్టీ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొంత మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ కేసులను ప్రస్తుత ప్రభుత్వం ఎత్తివేస్తూ...

కొడాలి నాని సంయమనం కోల్పోయి ఉండవచ్చు : సజ్జల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే.. పక్కాగా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది . అందులో డౌట్ లేదు. అందుకే కొడాలి నాని పనిగట్టుకుని అంటున్న మాటలు పై స్థాయి వారికి...

HOT NEWS

[X] Close
[X] Close