రక్త సంబంధంలో వున్న మ్యాజిక్ వేరు : నాగార్జునతో ఇంటర్వ్యూ

నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా హిట్. అందులో ‘బంగార్రాజు’ పాత్ర సూపర్ హిట్. సినిమాలో వినోదం అంతా ఆ పాత్రనే పంచింది. ఇప్పుడు ‘బంగార్రాజు’ పేరుతో సీక్వెల్‌ ని రెడీ చేశారు నాగార్జున. సీక్వెల్‌ కి వచ్చేసరికి నాగచైతన్య కూడా సందడి చేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో పంచుకున్న విశేషాలివి…

పెద్ద బంగార్రాజుతో అలరించారు. ఇప్పుడు చిన్న బంగార్రాజు సందడి ఎలా ఉండబోతుంది ?
బంగార్రాజులో వున్న స్పెషాలిటీనే చిన్న బంగార్రాజు. చైతు వచ్చాడు. బంగార్రాజులో మిస్ అయిన యూత్ ఫుల్ ఎనర్జీ చైతులో చూస్తారు.

బంగార్రాజు సీక్వెల్ కి వచ్చేసరికి బాధ్యత పెరిగిందా ?
‘సోగ్గాడే చిన్నినాయనా’ చాలా బాగా ఆడింది. అందరికీ నచ్చింది. సీక్వెల్ అన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత వుంటుంది. మొదటి సినిమా కంటే బెటర్ గా చేయాలి. ఆడియన్స్ కి పండగ స్పెషల్ కావాలి. కొత్తగా చైతు వచ్చాడు. నేనే నిర్మాతని. ఇవన్నీ బాధ్యతలే.

నాగచైతన్యని తీసుకోవడానికి కారణం ?
‘సోగ్గాడే చిన్నినాయనా’లో కొడుకు సమస్యని తీర్చడానికి బంగార్రాజు వచ్చాడు. బంగార్రాజుని మళ్ళీ కిందకి తీసుకురావడానికి కారణం అలోచించినపుడు రక్త సంబంధం వరసని ఆలోచిస్తే బంగార్రాజు మనవడు వున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా’లో తండ్రి కొడుకులు పాత్రలు నేనే వేశా. మనవడు అనేసరికి మరో ఆలోచన లేకుండా చైతుపేరునే చెప్పాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అయితే ముందు సరైన కథని తీసుకురమ్మన్నాను. మంచి కథ కుదిరింది. నిజానికి రక్త సంబంధం వున్న సినిమాలు అద్భుతంగా వర్క్ అవుట్ అవుతాయి. ఆ మ్యాజిక్ వేరు. ‘మనం’ సినిమా వేరే నటులని పెట్టి తీస్తే అది వర్క్ అవుట్ అయ్యేది కాదు. సినిమా తీయొచ్చు.. కానీ ఆ ఫీల్ రాదు. ‘మనం’ హిందీలో చాలా మందికి నచ్చింది. కానీ రక్త సంబంధం వున్న ఒకే కుటుంబం నటులు కుదరక వదిలేశారు. బంగార్రాజు లో కూడా అదే మ్యాజిక్ వుంటుంది.

బంగార్రాజు సీక్వెల్ ఉంటుందా ?
మొదట ఈ సీక్వెల్ ని కూడా ప్లాన్ చేసుకోలేదు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే సీక్వెల్ కోరుకున్నారు. బంగార్రాజు చూసిన తర్వాత ఇంకో సీక్వెల్ ప్లాన్ చేద్దాం. బంగార్రాజు కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి.. వారం తర్వాత నిర్ణయం తీసుకుందాం. (నవ్వుతూ )

అనూప్ రూబెన్స్ మీ ఆస్థాన సంగీత దర్శకుడిగా మారాడా ?
అనూప్ మంచి మ్యూజిక్ ఇస్తాడు. ఇష్క్ చూసిన తర్వాత మనం కి ఫైనల్ చేశాం. చార్ట్ బస్టర్ ఆల్బం ఇచ్చాడు. అన్నపూర్ణలో ఫ్యామిలీ మెంబర్ గా వుంటాడు. సోగ్గాడే కంటే బెటర్ మ్యూజిక్ ఇచ్చాడు. అందుకే మ్యూజిక్ నైట్ కూడా పెట్టాం.

ఇందులో చైతు బంగార్రాజులా కనిపించాలి. మీ నుండి ఎలాంటి సలహాలు ఇచ్చారు ?
ముందు ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా చూడమని చెప్పాను. గోదారి యాసకి సంబధించి డైలాగుని టేప్ చేసి ఇచ్చేవాడిని. నాకంటే దర్శకుడు కళ్యాణ్ చాలా కేర్ తీసుకున్నాడు.

ట్రెండీ పాత్రలు ఎంత సులువుగా చేస్తారో పల్లెటూరి పాత్రలు అంతే సహజంగా చేస్తారు ? ఎలా ?
నాన్నగారి నుంచి వచ్చింది. కెరీర్ బిగినింగ్ లో చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు .. ఈ సినిమాలు బాగా నచ్చాయి. చాలా ఓపెన్ అవ్వచ్చు. పల్లెటూరి పాత్రలని ఎంజాయ్ చేస్తా.

రమ్యకృష్ణ గారి కాంబినేషన్ గురించి చెప్పమంటే ?
గోల్డెన్ కాంబినేషన్. మా ఇద్దరి కెమిస్ట్రీ బావుంటుంది, తనతో వర్క్ చేసినప్పుడు సెట్స్ లో నవ్వుతూనే వుంటాం.

పండక్కి రావాలని చాలా కష్టపడినట్లు వున్నారు ?
అవును. చాలా పట్టుపట్టి చేశాం. సినిమా మొదలుపెట్టినపుడే ఎలాగైనా పండక్కి రావాలని ఫిక్స్ అయ్యాం. ఇది సంక్రాంతి హంగులు వున్న సినిమా. యూనిట్ ని కూర్చోబెట్టి ఈ సంక్రాంతి రాకపోతే సినిమా ఆపేద్దామని చెప్పా. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఫైనల్ గా పండక్కి వచ్చాం.

కళ్యాణ్ కృష్ణ తో మళ్ళీ పని చేయడం ఎలా అనిపించింది ?
కళ్యాణ్ చాలా కూల్. నచ్చకపొతే ఎన్ని వెర్షన్స్ అయినా మార్చుతాడు. చాలా మంచి రైటర్. కళ్యాణ్ తో పని చేయడం చాలా సౌకర్యంగా వుంటుంది.

బంగార్రాజు గా చైతు సరిపోయడా ?
చైతు ఆ పాత్రకి సరిగ్గా కుదిరాడు. సినిమా చూసిన తర్వాత చైతుని చూసి మీరంతా ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు.

ఏపీ టికెట్ల ధరలు సమస్య కాదని చెప్పారు ?
అలా చెప్పడానికి కారణం వుంది. ఏప్రిల్ 6లో ఏపీలో జీవో 35 వచ్చింది. అప్పుడే ఈ సినిమా గురించి లెక్కలు వేసుకున్నాం. నా సినిమా హిట్ అయితే ఇంత కలెక్ట్ చేస్తుంది. అది వర్క్ అవుట్ అవుతుందా లేదా? అని లెక్కలు వేసుకున్నాం. తగ్గించిన రేట్లతో బంగార్రాజు సినిమా వర్క్ అవుట్ అవుతుంది. రెట్లు పెరిగితే బోనస్. లేకపోయినా సేఫ్. సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలీదు. రెండేళ్ళుగా ఇంట్లో కూర్చుని వున్నాం. ఇంకా ఎంతకాలం కూర్చోవాలి. నాకు బిగ్ బాస్ వుంది కాబట్టి సరిపోయింది. మిగతా వారి జీవితం ముందుకు నడవాలి కదా. తగ్గించిన రేట్లు లెక్క చూసి సినిమా హిట్ అయితే మనం సేఫ్ అనుకున్న తర్వాత ఆ మాట చెప్పా. ఇక ఫ్లాఫ్ అయితే ఎవరకైనా నష్టాలు తప్పవు కదా.

చిరంజీవి గారు సిఎం ని కలవడానికి వెళ్తున్నారు ?
అవును. నాకు వారం రోజులు క్రితమే చెప్పారు. అల్ ది బెస్ట్ చెప్పా. సినిమా ప్రమోషన్స్ వల్ల నాకు కుదరలేదు.

బంగార్రాజు లో సర్ ప్రైజ్ లో ఏమైనా ఉన్నయా ?
ఖచ్చితంగా వున్నాయి. డెఫినెట్ గా అలరిస్తాయి.

పాటపాడినట్లు వున్నారు ?
అది పాట కాదు.. జస్ట్ చదివాను అంతే. ( నవ్వుతూ )

అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close