అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈనెల 11న విడుదల చేద్దామనుకొన్నారు. అయితే.. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే.. 12న వస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా ధృవీకరించింది. ఈరోజే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ అందింది. నవంబర్ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. 11న చైతూ సినిమా సాహసం శ్వాసగా సాగిపో విడుదలకు సిద్దమైంది. ఈ రెండు సినిమాలూ ఒకే రోజు ఢీ కొడతాయనుకొన్నారంతా. అయితే… ఇప్పుడు పోటీ లోంచి నరేష్ సినిమా తప్పుకొంది. థియేటర్ల సమస్య వల్లే.. నరేష్ సినిమా ఒకరోజు ఆలస్యంగా వస్తోందని తెలుస్తోంది. దాంతో చైతూకి సోలో రిలీజ్ దక్కినట్టైంది.