హైదరాబాద్ ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవం నేపథ్యంలో ప్రధాని మోడీని కలిశారు చిన్నజీయర్ స్వామి. మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావులతో కలిసి ప్రధాని నివాసానికి వెళ్ళిన చిన్నజీయర్ స్వామి..మోడీతో 45నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ ఏడాది చివరిలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని.. ఈ వేడుకకు విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరారు. ఇందుకు ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ప్రధాని మోడీ.. ముచ్చింతల్ లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అక్కడ 108దివ్యదేశాలలో కొలువుతీరిన దేవతామూర్తులకు నిత్యం జరిగే పూజా కార్యక్రమాలను ప్రధానికి చిన్నజీయర్ స్వామి వివరించారు. అలాగే ,చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో కొనసాగుతున్న ఆయుర్వేద- హోమియో కళాశాల గురించి ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే , ఆధ్యాత్మిక రంగాల్లో తనదైన కృషి చేస్తున్నారని వారిని ప్రధాని అభినందించడమే కాకుండా.. ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారని మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా. రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును ప్రశంసించారు మోడీ.