జగన్ రెడ్డి తన కారు కింద పడి ఎవరైనా చనిపోయినా భద్రత లేదంటారు. జిల్లా మొత్తం నుంచి జన సమీకరణ చేసుకుని తన మీద ఎగబడేలా చేసుకుని.. అదిగో వారంతా నా మీద ఎగబడుతున్నారు.. సెక్యూరిటీ లేదని గగ్గోలు పెడుతూంటారు. దేశంలో చాలా మంది నేతుల రోడ్ల మీదకు వెళ్తూంటారు. ఎక్కడా లేని డ్రామాలు జగన్ రెడ్డి టూర్లలోనే ఎందుకు జరుగుతాయి ?
జగన్ రెడ్డి బయటకు వస్తే డ్రామా కంపెనీనే
జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట సొంతంగా మాట్లాడలేరు. స్క్రిప్టు రాసివ్వాలి. అలాగే బయటకు వచ్చినా అంతే. ఆయన తాడేపల్లి నుంచి బయటపడితే మొత్తం ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగాలో.. స్క్రిప్టులో ఉంటుంది. పల్నాడు పర్యటనకు వెళ్లాలనుకున్నప్పుడు… దారి పొడవునా వైసీపీ నేతలకు టార్గెట్లు పెట్టారు. జగన్ రెడ్డి ఎక్కడెక్కడ ఆగుతారు.. ఎక్కడెక్కడ ఎంత మందితో రోడ్ షో చేయాలో టార్గెట్లు పెట్టారు. ఆ ప్రకారం జనాల్ని తరలించారు. పోస్టర్లు వేసుకుని జగన్ ముందు వీరంగాలు చేశారు. అంతా ప్రీప్లాన్డ్.
భద్రతకు ఢోకానే లేదు!
గతంలో మాజీ సీఎం రోడ్డు మీదకు వస్తే భద్రత ఉండేది కాదు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం కమెండోలతో సెక్యూరిటీ ఇచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతేరాళ్ల దాడులతో ఎన్ని సార్లు గాయపడేవారో చెప్పాల్సిన పని లేదు. అమరావతి పర్యటనకు వెళ్తే బస్సుపై చెప్పులేయించి.. ప్రజాస్వామ్య నిరసన అని డీజీపీతో చెప్పించారు. అలాంటి దౌర్భాగ్యమైన పాలన చేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం తన బాధ్యతల విషయంలో నిర్లక్ష్యం లేదు. జగన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత ఇస్తోంది. అసలు ఏటుకూరు రోడ్డులో ఆగి షో చేయాల్సిన ప్రోగ్రాం లేనప్పుడు రోప్ పార్టీ ఎందుకుంటుంది ?. మాజీ సీఎం అని ఆయన బాత్ రూంకు పోయినా చుట్టూ రోప్ పట్టుకుని నిల్చుంటారా?. జగన్ రెడ్డి కి సెక్యూరిటీ పిచ్చి ఉంది. సీఎంగా ఉన్నప్పుడు వేల మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడూ అలాగేకావాలనుకుంటున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే మాత్రమే. మాజీ సీఎం అని భద్రత ఇస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి లేనంత భద్రత ఇస్తున్నారు.
జగన్ నుంచే ఎవరికైనా ముప్పు …!
రాష్ట్ర రాజకీయాల్లో భౌతిక దాడులు… హింసాత్మక రాజకీయాలకు బ్రాండ్ ఒక్క జగన్ మోహన్ రెడ్డి. ఆయన ప్రెస్ మీట్ లో నరకడంలో తప్పేముంది అని చేసిన వ్యాఖ్యలే ఆయన మనస్థత్వానికి నిదర్శనం. ఆయన నుంచి ఎవరికైనా ముప్పు ఉంటుంది కానీ..ఆయనకు కాదు. ఇలాంటి కరుడుగట్టిన క్రిమినల్ మైండ్ సెట్ ను కంట్రోల్ చేయాలంటే.. అంతే క్రిమినల్ మైండ్ సెట్ తో ఆలోచించాల్సి ఉంటుంది. ఆయన నుంచి ప్రజలకు.. సింగయ్య లాంటి వారికి భద్రత కల్పించాల్సి ఉంది.