ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయాలన్ననిర్ణయాన్ని బీసీసీఐ ఉపసంహరించుకుంది. ఈ టోర్నీని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చింది. అందుకే వారం మాత్రమే వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించింది. ఈ లోపు మిగిలిన మ్యాచ్ లకు కొత్త షెడ్యూల్, వేదికలను ఖరారు చేయనున్నారు. వారంలో పరిస్థితి సద్దుమణిగిపోతుందని బీసీసీఐ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పాకిస్తాన్ వద్ద యుద్ధం చేసే సరుకు లేదు. దొంగ దెబ్బతీయడానికే ప్రయత్నిస్తోంది. దానికి భారత్ బుద్ది చెబుతోంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి, ఆర్థిక పరిస్థితుల కారణంగా పాకిస్తాన్ సైలెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాడులు ఉంటేనే భారత్ ప్రతిదాడులు చేస్తుంది కాబట్టి.. ఉద్రిక్తతలు పాక్ వెనక్కి తగ్గితే ఆటోమేటిక్ గా తగ్గిపోతాయని భావిస్తున్నారు. ఒక వేళ ఉద్రిక్తతలు ఇలాకొనసాగినా.. దక్షిణ భారతంలో ఐపీఎల్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖ వంటి స్టేడియాలు సురక్షితమైనవి. అందుకే ఈ నగరాల్లో మిగిలిన మ్యాచులు, క్వాలిఫయర్స్, ఎలినిమినేటర్, ఫైనల్స్ వేదికలుగా ఖరారు చేసే అవకాశం ఉంది. టోర్నమెంట్ రద్దు చేయాల్సినంత ఉద్రిక్త పరిస్థితులు లేవని బీసీసీఐ నమ్ముతోంది.