ఐపీఎల్ స్టోరీస్‌: విరాట్ కి ఏమైంది?

విరాట్ కోహ్లీ.. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా, ఫార్మెట్ ఏదైనా – బౌల‌ర్ల‌పై భీక‌రంగా విరుచుకుపోవ‌డ‌మే త‌న‌కు తెలుసు. ఐపీఎల్ అంటే.. మ‌రింత చెల‌రేగిపోతాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు… కోహ్లీదే. అయితే ఈ ఐపీఎల్ లో విరాట్ కి చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతున్నాయి. విరాట్ బ్యాటింగ్ చూస్తే అతి సాధార‌ణ‌మైన బ్యాట్స్‌మెన్ అయిపోయాడేంటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ మూడు మ్యాచ్‌ల‌లో కోహ్లీ స్కోరు కేవ‌లం 18 మాత్ర‌మే. వరుస‌గా మూడు మ్యాచుల్లోనూ త‌క్కువ స్కోర్ల‌కు అవుట్ అవ్వ‌డం కోహ్లీ కెరీర్‌లో బ‌హుశా ఇదే తొలిసారి కావొచ్చు. పైగా కోహ్లీ అవుట్ అయిన బంతులేమీ అద్భుతం అన‌ద‌గ్గ‌వేం కాదు. అతి సాధార‌ణ‌మైన బంతులే. ఫామ్‌లో ఉన్న‌ప్పుడు ఆయా బంతుల్ని అవ‌లోక‌గా బౌండ‌రీల‌కు త‌ర‌లిస్తాడు కోహ్లీ. ఎందుకో.. బ్యాటింగ్ కి దిగినప్పుడు కోహ్లీ ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత ఒత్తిడికి లోన‌వుతున్నాడు.

ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ఫీల్డ‌ర్ల‌లో కోహ్లీ ఒక‌డు. కానీ.. త‌న చేతుల్లోంచి క్యాచులు చేజారిపోతున్నాయి. పంజాబ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ రెండు అమూల్య‌మైన క్యాచులు నేల పాలు చేశాడు. రెండూ కె.ఎల్‌.రాహుల్ వే. కోహ్లీ క్యాచులు వ‌దిలేశాక‌.. రాహుల్ మ‌రింత రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. రాహుల్ క్యాచ్‌ల‌ను వ‌దిలేయ‌డ‌మే పెద్ద త‌ప్పిద‌మ‌ని, అదే మ్యాచ్ ఫ‌లితాన్ని శాశించింద‌ని కోహ్లి సైతం స్వ‌యంగా ఒప్పుకున్నాడు. ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఫీల్డింగ్ చాలా సాధార‌ణంగా క‌నిపించింది. బెంగ‌ళూరుకు బ‌లం కావాల్సిన కోహ్లీ.. ఇలా.. బ‌ల‌హీనత‌గా మార‌డం ఆ జ‌ట్టు విజ‌యావ‌కాశాల్ని దెబ్బ తీస్తోంది. అయినా ఇప్ప‌టికీ మించిపోయిందేం లేదు. కోహ్లీకి ఒక్క మ్యాచ్ చాలు. తిరిగి ల‌య అందుకోవ‌డానికి. త‌ను ట‌చ్‌లోకి వ‌స్తే.. ఎప్ప‌టిలానే బౌల‌ర్ల‌కు నిద్ర‌లేని రాత్రులు మిగులుస్తాడు. అసాధార‌ణ‌మైన ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొట్టేస్తాడు. టోర్నీలో.. పించ్, డివిలియ‌ర్స్‌, దూబే.. వీళ్లంతా మ్యాచ్‌ల‌ను కాపు కాస్తున్నారు. వాళ్ల‌కు కోహ్లీ కూడా తోడైతే – త‌ప్ప‌కుండా ఈ ఐపీఎల్ వేట‌లో బెంగ‌ళూరు ముందుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనూ రేటు: రోజుకి 20 ల‌క్ష‌లు

ఈ కరోనా స‌మ‌యంలో.. సోనూసూద్ రియ‌ల్ హీరో అయిపోయాడు. హీరోల‌కూ, రాజ‌కీయ నాయ‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, సంస్థ‌ల‌కు ధీటుగా - సేవ‌లు అందించాడు. త‌న యావ‌దాస్తినీ దాన ధ‌ర్మాల‌కు ఖ‌ర్చు పెట్టేస్తున్నాడా? అనేంత‌గా...

స‌ర్కారు వారి పాట అప్ డేట్: మ‌హేష్ ముందే వెళ్లిపోతున్నాడు

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా `సర్కారువారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 4 నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీసా వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. అయితే చిత్ర‌బృందం కంటే ముందే.. మ‌హేష్...

ఏపీ విద్యార్థుల్ని కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు...

“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట... పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్...

HOT NEWS

[X] Close
[X] Close