నిప్పుల కొలిమిలా మారిన పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రభుత్వం కొన్ని కీలక షరతులతో కాల్పుల విరమణ ప్రతిపాదనను అంతర్జాతీయ సమాజం ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ , అమెరికా మిత్రపక్షాల నుండి ఎదురవుతున్న తీవ్రమైన వైమానిక దాడులతో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకుని చర్చల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన తాజా వ్యాఖ్యల ప్రకారం, ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఉంటేనే కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రతిపాదనలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నట్లు స చెబుతున్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు నిలిపివేయడం, గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక ఆంక్షలను సడలించడం, లెబనాన్ , గాజాలో తక్షణ శాంతిని నెలకొల్పడం. ఈ షరతులను అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరిస్తే ఇరాన్ తన క్షిపణి దాడులను పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధమని ప్రకటించింది.
ఇరాన్ అధ్యక్షుడు పొరుగు దేశాలకు కీలక సందేశం పంపారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, ప్రాంతీయ శాంతి కోసం సహకరించాలని ఆయన కోరారు. ఇరాన్ తన ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవడానికి, అంతర్జాతీయంగా ఒంటరి కాకుండా ఉండేందుకు ఈ శాంతి మంత్రం జపిస్తోందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఎలా స్పందిస్తారన్నదానిపై.. యుద్ధం ఉంటుందా ఆగుతుందా అన్నది తేలే అవకాశం ఉంది.