పుష్ప స్ట్రాటజీ సరైనదేనా ?

‘పుష్ప’ విడుదలకు ఇంకా మూడు రోజులే వుంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గానే జరిగింది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ లేరు. అది కొంత లోటు. దేవిశ్రీ వుంటే ఆ హంగామా వేరుగా వుండేది. కానీ ఇంకా మిక్సింగ్ పని పూర్తి కాలేదు. దీంతో సుక్కు, దేవి ముంబాయ్ లో వుండిపోవాల్సి వచ్చింది. ఇంకా మూడు రోజులు అంటే.. ఎక్కువ సమయం లేదు. కౌంట్ డౌన్ గంటల్లోకి వచ్చేసిందనే చెప్పాలి. అయితే సమయం ఇంత దగ్గర పడుతున్నా పుష్ప యూనిట్ లో ప్రమోషన్స్ వేడి కనిపించడం లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్ వరకూ ఓకే. కానీ పుష్ప పాన్ ఇండియా సినిమా. కనీసం ముంబాయ్, బెంగళూరు. చెన్నయ్ వేదికలపై పుష్ప ప్రచారం జరగాలి. కానీ అది కనిపించడంలేదు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకా సమయం వుంది. అయితే ఈ గ్యాప్ లోనే ఆర్ఆర్ఆర్ దేశాన్ని చుట్టేసింది. కానీ పుష్ప టీంలో చలనం కనిపించడం.

ఇన్నర్ టాక్ ఏమిటంటే .. నిర్మాతలకు ప్రమోషన్ చేయాలనే వుందట. కానీ బన్నీలో ఆసక్తి కనిపించడం లేదు. ప్రమోషన్స్ పై బన్నీ అభిప్రాయం మరోలా వుంది. సినిమా అద్భుతంగా వచ్చిందని, మౌత్ టాక్ జనాలని థియేటర్ లోకి రప్పిస్తుందనేది బన్నీ నమ్మకం. అందుకే బన్నీ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న మలయాళంలో కూడా పుష్పని ఎక్కువగా ప్రమోట్ చేయడం లేదు. పుష్ప ని సరిగ్గా ప్రమోట్ చేయడం లేదనే అభిప్రాయాన్ని దర్శకుడు రాజమౌళి కూడా ఇన్ డైరెక్ట్ గా నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. ”బన్నీ ఇది చాలా గొప్ప సినిమా. ముంబాయ్ లో పుష్ప గురించి అడుగుతున్నారు. నీవు అక్కడ కూడా దిన్ని ప్రమోట్ చేయాలి” అని చెప్పారు రాజమౌళి. పుష్ప కి పాన్ ఇండియా ప్రమోషన్ అవసరం అనే సంగతి రాజమౌళి గుర్తించారంటే .. పాన్ ఇండియా ప్రమోషన్ లో పుష్ప ఎంత నెమ్మదిగా వుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రమోషన్స్ కి నిర్మాతలు రెడీగానే వున్నారు. కానీ బన్నీ స్ట్రాటజీ కాస్త వేరుగా వుంది. మరి బన్నీ వ్యూహం ఎంత వరకు కరెక్టో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close