” ప్రభుత్వ భారం” దించేసుకునే ప్రయత్నాలా ? నడపలేకపోతున్నారా ?

ప్రభుత్వాన్ని నడపలేక భారం దించేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయా..? అధికార పార్టీ తప్పు అని తెలిసినా వ్యూహాత్మకంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందా..? . తమకు సంబంధం లేదని ప్రజల్ని నమ్మించి బాధ్యతల నుంచి తప్పించుకుని “ప్రభుత్వ భారాన్ని’ దింపేసుకునే ప్రయత్నం చేస్తున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తే అంతే అని అనుకోక తప్పని రాజకీయవర్గాలు అంటున్నాయి.

రాష్ట్రపతి పాలన కోసమే వైసీపీ పెద్దల ప్రయత్నాలు ?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు . అంతకు ముందు ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబుకు అంత ఆతృత ఎందుకు అని ప్రశ్నించారు. కానీ ఆతృత చంద్రబాబుకు కాదని.. వైసీపీ పెద్దలకే ఉన్నట్లుగా ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే రాజ్యాంగ విరుద్ధంగా.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటట్లుగా.. జాతీయ స్థాయిలో తమ దారుణాలు బయటపడేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం.

ఓ సీఎం దాడుల్ని సమర్థించడమా ? రాజ్యాంగం కుప్పకూలిపోయిందని నిరూపించేశారా ?

ముఖ్యమంత్రి అంటే ఓ బాధ్యత. తన హయాంలో చిన్న నేరం జరిగినా తన వైఫల్యంగా భావించాల్సిన బాధ్యత. కానీ ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి దాడుల్ని సమర్థించారు. అది నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యేలా చేసుకున్నారు. ఓ ముఖ్యమంత్రి శాంతిభద్రతల ఉల్లంఘనను సమర్థించారంటే ఆ రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిపోయిందనే అర్థం. ఆ విషయంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోంది. దాడుల దృశ్యాలు.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు… రాష్ట్రంలో ఎక్కడా రాజ్యాంగం అమలు కావడం లేదన్న భావనకు వచ్చేలా చేస్తున్నాయి.

ప్రభుత్వాన్ని కూల్చివేతకు కుట్రలంటూ జగన్ మీడియాలో చర్చలు !

ఈ ఘటనలు ప్రారంభమవడానికి ముందే జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారంటూ చర్చలు ప్రారంభించారు. పట్టుమని పదిహేను మంది ఎమ్మెల్యేలు లేరు.. వారిలోనూ నోరెత్తడానికి పది మంది భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా కూల్చేస్తాడో ఎవరికీ అర్థం కాలేదు . కానీ వైసీపీ పెద్దలు వ్యూహాత్మకంగానే ఈ ప్రచారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. తమ రాజ్యాంగ ఉల్లంఘన చర్యల ద్వారా రాష్ట్రపతి పాలన పడేలా చేసుకుని ఆ తప్పును టీడీపీపైకి నెట్టేసి..మళ్లీ ప్రజల వద్దకు సానుభూతి కోసం వెళ్లే వ్యూహమని అనుమానిస్తున్నారు.

ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి !

ఇప్పుడు ప్రభుత్వాన్ని అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టాయి. జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. పథకాలను వాయిదా వేస్తూ పోతున్నారు. అమ్మఒడిని జూన్‌లో ఇస్తామని చెప్పారు. కానీ లబ్దిదారుల్లో తేడా రియాక్షన్ వస్తుందని గుర్తించారు. జూన్‌లో ఇస్తారో లేదో స్పష్టత లేదు. ఈ లోపు చేయాల్సినవి చాలా ఉన్నాయి. వడ్డీలు, జీతాలు, రోడ్లు ..కాంట్రాక్టర్లకు బిల్లులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. కొద్ది రోజులు ఆగితే తమ వైఫల్యం మొత్తం రోడ్డున పడుతుంది. అప్పుడు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకున్నా.. ఇప్పటికే ఉన్న ఆగ్రహం మరింత పెరుగుతుందని వైసీపీపెద్దలు అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. అందుకే బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఇదో మార్గమని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close