ఇంతకీ జగన్ ఎక్కడ: వాటి నుండి దృష్టి మళ్లించేందుకు బాబు అరెస్ట్?

ఆ మధ్య వచ్చిన ధ్రువ సినిమాలో, వేరు వేరు వార్తలని లింక్ చేయడం ద్వారా తెర వెనుక జరుగుతున్న సంగతులను పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే సీన్ ఒకటి ఉంటుంది. అప్పట్లో ఆ సీన్ కి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు , తదనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సైతం అదే కోవలో విశ్లేషిస్తూ సోషల్ మీడియా లో చర్చిస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యం లో ఇంతకీ ప్రస్తుతం జగన్ ఎక్కడ అన్న ప్రశ్న చర్చనీయాంశం గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

తన మీద ఉన్న అక్రమ ఆస్తుల కేసు దృష్ట్యా జగన్ దేశాన్ని విడిచి వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే చాలా సంవత్సరాల తర్వాత 2023 సెప్టెంబర్ 2 నుండి 12వ తేదీ వరకు యూరోప్ పర్యటించడానికి , అక్కడ ఉన్న తమ కుమార్తె లను కలవడానికి జగన్ సిబిఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో అక్రమ ఆస్తుల కేసుల్లో రెండవ నిందితుడుగా ఉన్న, జగన్ అక్రమ లావాదేవీలన్నీ పూర్తిగా తెలిసిన వ్యక్తిగా భావిస్తూ ఉన్న, విజయ సాయి రెడ్డి కూడా యూఎస్ వెళ్లడానికి సిబిఐ కోర్టు నుండి అనుమతి పొందారు. ఆగస్టు చివరి వారం లో ఈ అనుమతులు వచ్చాయి. ఇది మొదటి వార్త.

జగన్ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు లో ఉన్న సమయం లో యూరప్ లోని కొన్ని దేశాల తో జగన్ కి మనీ లాండరింగ్ లావాదేవీలు ఉన్నాయని, ప్రజలందరికీ తెలిసిన స్విస్ బ్యాంక్ తరహాలో ఆపరేట్ చేసే యూరోపియన్ బ్యాంకులు యూరప్ లోని కొన్ని చిన్న చిన్న దేశాలలో విస్తారంగా ఉన్నాయని, అటు వంటి బ్యాంకుల లో జగన్ అక్రమాస్తుల ద్వారా సంపాదించిన సొమ్మును భద్రం చేశాడని, భారత్ కి చెందిన దర్యాప్తు సంస్థలు సైతం ఈ బ్యాంకుల నుండి సమాచారం రాబట్టలేవు అని అప్పట్లో, అంటే జగన్ మీద కేసులు నమోదైన కొత్తలో, పలు రాజకీయ నాయకులు ఆరోపణలు చేసేవారు. ఇది ఒక పాత వార్త.

సరిగ్గా ఎన్నికల ఏడాదిలో జగన్ విదేశీ పర్యటన సామాన్యులకు ఆశ్చర్యం కలిగించేదే. పైగా కూతుర్లతో సమయం గడపాలనుకుంటే వారు భారత్ కి రావడం పెద్ద కష్టమేమీ కాదు. అటు వంటి పరిస్థితుల్లో సిబిఐ కోర్టు నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ జగన్ యూరోప్ పర్యటన కు బయలుదేరడం బహుశా తన ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవడానికే అయి ఉంటుంది అంటూ జనసేన నేత ఒకరు మీడియా ముందు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇది మూడవ వార్త.

మొత్తానికి జగన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ లావాదేవీలు చక్కబెట్టుకుంటున్నాడు అని ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ సంఘటన ద్వారా మీడియా అటెన్షన్ మొత్తం అటువైపు వెళ్లిపోయింది. పైగా జాతీయ మీడియా జీ 20 సమావేశాలతో బిజీగా ఉంది . అటువంటి సమయంలో ఈ అరెస్ట్ జరిగిన కారణంగా జాతీయ మీడియా లో ఈ సంఘటన కు రావాల్సినంత ప్రాధాన్యత రాలేదు. ఇది నాలుగవ వార్త.

ఈ నాలుగు వార్తలను లింక్ చేస్తూ సోషల్ మీడియా లో చర్చిస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ప్రస్తుతం జగన్ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, చంద్రబాబు అరెస్టు వైపు మన దృష్టిని మళ్లించి తాను ఏ లావాదేవీలు ఎక్కడ చక్కబడుతున్నాడు అని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల లో నిజం ఏమైనా ఉందా ? ఎన్నికలకు సమాయత్తం కావడానికో లేక ఎన్నికలయ్యాక మన ప్రభుత్వం రాకపోతే ఇబ్బంది రాకుండా ఉండడానికి ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికో జగన్ వెళ్ళాడు అంటూ కొందరు చేస్తున్న చర్చలు పూర్తిగా ఊహగానాలేనా ? ఇవన్నీ నిజమా కాదా తెలియడానికి సమయం పట్టవచ్చు లేక ఎప్పటికీ తెలియకుండాపొనూ వచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’*అనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను *వీకెండ్...

టీడీపీ, జనసేన క్యాడర్ సమన్వయ బాధ్యతలు తీసుకున్న నాగబాబు

టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా కలిసి పోటీ చేసేందుకు ఓట్ల బదిలీ సాఫీగా జరిగేందుకు..క్యాడర్ మధ్య సమన్వయం సాధించే బాధ్యతను మెగా బ్రదర్ నాగబాబు తీసుకున్నారు....

లండన్‌లో జగన్ రెడ్డి ఫ్యామిలీకీ ఏపీ ప్రజల ఖర్చుతోనే సెక్యూరిటీ

ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన...

లింగుస్వామికి ఓ హీరో కావాలి

‘పందెంకోడి’, ‘ఆవారా’ వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన దర్శకుడు లింగుస్వామి. ఇటీవల రామ్‌తో ‘ది వారియర్‌’ తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైయింది. ఇప్పుడు మళ్ళీ ఓ తెలుగు హీరోతోనే సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close